పరమపురుషుడు
రాగం : మోహన , తాళం : ఆది
అన్నమయ్య సంకీర్తన (చిన్ని క్రిష్ణుని పాటలు)
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
పల్లవి :
పరమపురుషుడు గోపాలబాలుడైనాడు
మురహరుడు ఎదుటా ముద్దుగారే నిదివో
….పరమపురుషుడు….
చరణం :
వేదపురాణములలో విహరించే దేవుడు
ఆదిమూలమైనట్టి అలబ్రహ్మము
శ్రీదేవి పాలిట చెలగే నిధానము
సేద దీరి యశోదకు శిశువాయెనిదివో
….పరమపురుషుడు…..
మొక్కేటి నారదాదుల ముందరి సాకారము
అక్కజపు జీవులలో అంతర్యామి
గ్రక్కన బ్రహ్మకొడుకుగా (క)గన్నపరమము
అక్కరతో వెన్నముచ్చై ఆటలాడినిదివో
…...పరమపురుషుడు…..
దేవతలగాచుటకు దిక్కైన విష్ణుడు
భావములు ఒక్కరూపైన భావతత్వము
శ్రీవేంకటాద్రి మీద చేరియున్న ఆవరదుడు
కైవసమై గొల్లెతల కౌగిళ్ళ నిదివో
…..పరమపురుషుడు గోపాలబాలుడైనాడు
మురహరుడు ఎదుటా ముద్దుగారే నిదివో ….పరమపురుషుడు….
మీకు ఫైనాన్స్ అవసరమా? మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? వ్యాపారం విస్తరించడానికి ఫైనాన్స్ పొందటానికి మరియు ఏదైనా మొత్తంలో కొత్త వ్యాపారాన్ని సెటప్ చేయడానికి మేము వ్యక్తులు మరియు సంస్థలకు సహాయం చేస్తాము. 3% సరసమైన వడ్డీ రేటుతో ఫైనాన్స్ పొందండి, వ్యాపారం కోసం మరియు మీ బిల్లులను క్లియర్ చేయడానికి మీకు ఈ ఫైనాన్స్ అవసరమా? మరింత సమాచారం కోసం ఇప్పుడే మాకు ఇమెయిల్ పంపండి (financialserviceoffer876@gmail.com) whats-App +918929509036 ద్వారా మమ్మల్ని సంప్రదించండి
రిప్లయితొలగించండి