14, ఏప్రిల్ 2020, మంగళవారం

Nigama nigamanta varnita నిగమ నిగమాంత వర్ణిత

నిగమ నిగమాంత వర్ణిత
రచన : అన్నమాచార్యలవారు
స్వర రచన : ఆనందభట్టార్ గారు
రాగం : హిందోళం,తాళం : ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి :
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజధరుడ శ్రీనారయణా
నారాయణ...శ్రీమన్నారాయణా..2

చరణం :
దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం బీయ
నోపక కదా నన్ను నొడబరపుచు
పైపైనె సంసార బంధముల గట్టేవు
నాపలుకు చెల్లునా నారాయణా

చీకాకు పడిన నాచిత్తశాంతము సేయ
లేకకా నీవు బహులీల నన్ను
కాకుసేసెదవు బహుకర్మముల బడువారు
నాకొలదివారలా నారాయణా

వివిధ నిర్భంధముల వెడలద్రోయక నన్ను
భవసాగరముల తడబడ జేతువా
దివిజేంద్ర వంద్య శ్రీతిరువేంకటాధీశ
నవనీతచోర శ్రీనారాయణా

1 కామెంట్‌:

  1. మీకు ఫైనాన్స్ అవసరమా? మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? వ్యాపారం విస్తరించడానికి ఫైనాన్స్ పొందటానికి మరియు ఏదైనా మొత్తంలో కొత్త వ్యాపారాన్ని సెటప్ చేయడానికి మేము వ్యక్తులు మరియు సంస్థలకు సహాయం చేస్తాము. 3% సరసమైన వడ్డీ రేటుతో ఫైనాన్స్ పొందండి, వ్యాపారం కోసం మరియు మీ బిల్లులను క్లియర్ చేయడానికి మీకు ఈ ఫైనాన్స్ అవసరమా? మరింత సమాచారం కోసం ఇప్పుడే మాకు ఇమెయిల్ పంపండి (financialserviceoffer876@gmail.com) whats-App +918929509036 ద్వారా మమ్మల్ని సంప్రదించండి

    రిప్లయితొలగించండి