22, మార్చి 2022, మంగళవారం

ఆహా ఏమి సొగసు ఈ సీతది

 ఏమి సొగసు ఈ సీతది

రచన: శ్రీమతి సరోజనీ శాస్త్రీగారు

తాళం :ఆదితాళం, 

రాగం: హమీర్ కళ్యాణి

గానం:శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు

Audio

పల్లవి : ఆహా….

ఏమి సొగసు ఈ సీతది ఎంతటి సౌకుమార్యమీ సుదతిది


చరణం:

కలువరేకుల వంటి కన్నులతో 

సంపెంగ సుమము బోలు నాసికతో

బింబఫలము వంటి అధరమ్ములతో

 తళ తళమను దంతకాంతులతో

….ఏమి సొగసు ఈ సీతది…


విశాల ఫాల భాగముపై తుమ్మెద గుంపుల వోలె ముంగురులు ముసరగా 

శంఖముల వంటి కర్ణేంద్రియముల కర్ణాభరణములు శోభిల్లగా

...ఏమి సొగసు ఈ సీతది…


అందమగు హస్తముల గాజుల ధ్వనితో 

కటిఘటిత మేఖల మువ్వల సవ్వడితో

కరకంకణముల అందెల రవళుల 

అందాల భరిణ తన హంస నడకతో

….ఏమి సొగసు ఈ సీతది

ఎంతటి సౌకుమార్యమీ సుదతిది

ఆహా... ఏమి సొగసు ఈ సీతది…


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి