15, మార్చి 2022, మంగళవారం

Hari itandu...హరి ఇతండు

 హరి ఇతండు

             రచన - తాళ్ళపాక అన్నమాచార్యులు

             రాగం - శుద్ధధన్యాసి, తాళం -ఏకతాళం

              గానం - శ్రీమతి మొక్కరాల కామేశ్వరి గారు


Audio

॥ప॥  హరి ఇతండు హరుడతండు

                ఆకారమొక్కటే

          హరిహరులందున అధికులెవ్వరు లేరు

                   అధికులెవ్వరు లేరు


॥చ॥  మెరికురులితనికి మరుజడలతనికీ 

          ఉరగ పరపితనికి ఉరగములతనికీ

          విరికన్నులితనికి చిచ్ఛరకన్నతనికీ

          గరుడుడితనికి ఘనవృషభమతనికీ

                                                 (హరి ఇతండు) 


॥చ॥  శ్రీతరుణి ఇతనికీ శ్రీగౌరి అతనికీ

          భూతలంబితనికీ శీతనగమతనికీ

          జాతిమణులితనికీ విషమణులతనికీ

          రీతిగంధమితనికి భూతిపూతలతనికీ

                                              (హరి ఇతండు)


॥చ॥  కరిభయహరుడితడు కరిముఖుని          

              గురుడతడు

         నరసింహుడితడు అర్ధనారీశ్వరుండతడు

         మురవైరి ఈతడు పురహరుడతడు

         పరగ శ్రీవేంకటశైలపతి ఈతడే అతడు

                                           (హరి ఇతండు)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి