కప్పురంపు విడెములివిగోను
రచన: తూము నరసింహదాసు
రాగం: శంకరాభరణం, తాళం: మిశ్రచాపు
గానం: శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
పల్లవి:
కప్పురంపు విడెములివిగోను
శ్రీరామచంద్ర కరుణా చేకొనుము మ్రొక్కెను
కప్పురంపు విడెములివిగోను
శ్రీరామచంద్ర కరుణా చేకొనుము మ్రొక్కెను
నిపుణాతో సీత నెలత అందిచ్చెడి
…..కప్పురంపు విడెములివిగోను /
…. కప్పురంపు విడెములివిగోను శ్రీరామచంద్ర కరుణా చేకొనుము మ్రొక్కెను…
చరణం:
పచ్చిపోకలు పండుటాకు లవంగాలు
హెచ్చైన ఏలకులు మిళితమై ఒప్పేడు
…..కప్పురంపు విడెములివిగోను /
….కప్పురంపు విడెములివిగోను శ్రీరామచంద్ర కరుణా చేకొనుము మ్రొక్కేను…
కాచు నారీకేళ ఖండములు యెంతో
రాచ యోగ్యమైన దాల్చిన యుతముగా
….కప్పురంపు విడెములివిగోను /
….కప్పురంపు విడెములివిగోను శ్రీరామచంద్ర కరుణా చేకొనుము మ్రొక్కెను…
పండు జాజి ఫలములు పలుచని జాపత్రి
దండిగా నరసింహదాసుడర్పించేటి
…..కప్పురంపు విడెములివిగోను /
….కప్పురంపు విడెములివిగోను
శ్రీరామచంద్ర కరుణా చేకొనుము మ్రొక్కెను..2
నిపుణాతో సీత నెలత అందిచ్చెడి
కప్పురంబు విడెములివిగోను
శ్రీరామచంద్ర కరుణా చేకొనుము మ్రొక్కెను…3….
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి