ఆరగించవయ్య రామ
రచన : తూము నరసింహదాసు
రాగం:ఝుంఝుటి , తాళం: తిశ్రగతి….ఆది
గానం: శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
పల్లవి:
ఆరగించవయ్య రామ అతివ తోడను…….
ఆరగించవయ్య రామ అతివ తోడను సీతమ్మతోడ ..2
….ఆరగించవయ్య రామ అతివ తోడను సీతమ్మతోడ
ఆరగించవయ్య రామ అతివ తోడను….2
చరణం:
ఆరగించవయ్య అరటి పండ్లు చెఱుకు పానకము ..2
దోర మామిడి పండ్లు పనసతొనలు మంచి తేనె చక్కెర..2
….ఆరగించవయ్య రామ అతివ తోడను సీతమ్మతోడ
ఆరగించవయ్య రామ అతివ తోడను….
ఊరగాయ పెరుగు చలిది తీరు, పులియోగిరమును …2
పాలు మీగడ కండచక్కెర బంగారు గిన్నెలతో ..2
….ఆరగించవయ్య రామ అతివ తోడను సీతమ్మతోడ
ఆరగించవయ్య రామ అతివ తోడను ….
దాసమాన సాంబుజ విభాసమాన రామచంద్ర …
రామా ~~~~
దాసమాన సాంబుజ విభాసమాన రామచంద్ర
భుసురాధిప నారసింహ దాస హృదయ శ్రీనివాస…2
….ఆరగించవయ్య రామ అతివ తోడను సీతమ్మతోడ..2
ఆరగించవయ్య రామ అతివ తోడను…3
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి