26, మార్చి 2023, ఆదివారం

పవళించవయ్య

పవళించవయ్య

రచన - తూము నరసింహ దాసు

గానం - మొక్కరాల కామేశ్వరి గారు

రాగం - శ్రీరాగం , తాళం - మిశ్రచాపు

Audio

॥ప॥ పవళించవయ్యా…..

 పవళించవయ్యా మా రామయ్య! 

పవళించవయ్యా! మా రామయ్య!


॥అ.ప॥ 

పవళింపు మీశేష పర్యంకమందున..2

కవగూడి సేవక గణములు గొల్వగా..2 

పవళించవయ్యా….మా రామయ్య

పవళించవయ్యా….


॥చ॥  

సొంపైన యువిదల గుంపుల వీణా వాయింపు  లాలింపుచు ఇంపొందు సతిగూడి

పవళించవయ్యా…..

సొంపైన యువిధల గుంపుల వీణా వాయింపు  లాలింపుచు యింపొందు సతిగూడి

….పవళించవయ్యా..మారామయ్య

పవళించవయ్యా….

 

॥చ॥ 

చిలుకల కొలుకులు పలుకు తీయని ముద్దు

పలుకు లాలింపుచు కలికి సీతను గూడి

పవలించవయ్యా...

చిలుకల కొలుకులు పలుకు తీయని ముద్దు

పలుకు లాలింపుచు కలికి సీతను గూడి

పవళించవయ్యా.. మా రామయ్య

 పవళించవయ్యా…

 

॥చ॥ 

తిరముగ సాకేత పురమున నెలకొని 

నరసింహదాసుని యెరసి బ్రోచెడు సామి

పవళించవయ్యా...

తిరముగ సాకేత పురమున నెలకొని నరసింహదాసుని యెరసి బ్రోచెడు సామి

పవళించవయ్యా..మా రామయ్య

పవళింపు మీశేష పర్యంకమందున

కవగూడి సేవక గణములు గొల్వగా

పవళించవయ్యా… మా రామయ్య…2

పవళించవయ్యా….

లా…లి…లాలి

లా…లీ..లా…లీ…

లా…లి….లా…….లీ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి