29, ఆగస్టు 2016, సోమవారం

నా తెలుగు NAA TELUGU

నా తెలుగు
పల్లవి  :  
శ్రీకాకుళ పురి ఆంధ్రవిష్ణుని శ్రీకమలం నా తెలుగు
సాగర క్రిష్ణా సంగమ స్మృతిలో నవరాగం నా తెలుగు
చరణం  :
మువ్వ వేణు గోపాలుడూదే పిల్లన గ్రోవే నాతెలుగు
కులుకుల అలుకలు సత్యకు నేర్పే కూచిపూడియే నా తెలుగు..శ్రీకాకుళ…

ఆత్మా నాత్మా వివేకం తెలిపే హంసలదీవే నా తెలుగు
కవిని శివునిగా ఆరాధించే అవనిగడ్డయే నా తెలుగు...శ్రీకాకుళ…

పద్య పఠనమున పాప నాశనము చేసే మహిమే నా తెలుగు
నదిలో వేదం చదివి సూర్యునికి ఒసగే అర్ఘ్యం నా తెలుగు….శ్రీకాకుళ…

ప్రపంచమే తన స్వరముగా నిలిపిన మురళీ మాధురి నా తెలుగు
ఇంద్రకీలాద్రి చంద్రకళాధరి ముక్కు పుడకయే నా తెలుగు...శ్రీకాకుళ…

వేదాద్రి నగర శ్రీ నరసింహుని వేద హృదయమే నా తెలుగు...శ్రీకాకుళ…

వాన చినుకులకు బయటపడే వజ్రాల గుంటయే నా తెలుగు
వెన్న ఘుమ ఘుమల వెన్నల జున్నుల చల్లపల్లి యే నా తెలుగు...శ్రీకాకుళ…..
నవరాగం నా తెలుగు,  నవరాగం నా తెలుగు.


NAA TELUGU

PALLAVI:
SRIKAKULA PURI ANDHRA VISHNUNI SRI KAMALAM NAA TELUGU
SAGARA KRISHNA SANGAMA  LO NAVA RAGAM NAA TELUGU

CHARANAM :

MUVVA VENU GOPSLUDUDE PILLANA GROVE NAA TELUGU
KULUKULA ALAKALU SATYA KU NERPE KUCHIPUDIYE NAA TELUGU.
…..SRIKSKULA……

ATMA NATMA VIVEKAM TELIPE HANSALADEVE NAA TELUGU
KAVINI SIVUNI GA ARADHINCHE AVANI GADDA YE NAA TELUGU
…….SRIKSKULA…

PADYA PATANAMUNA PAPANASANAM CHESE MAHEME NAA TELUGU
NADILI VEDAM CHADIVE SURYUNIKI VOSAGE AARGYAM NAA TELUGU
....SRIKAKULA…..

PRAPAMCHAME TANA SARVAMUGA NILIPINA MURALI MADHURI NAA TELUGU
INDRA KILARDRI CHANDRA KALADHARI
MUKKU PUDAKAYE NAA TELUGU. …….. SRIKAKULA……

VEDADRI NAGARA SRI NARASHIMHUNI VEDA HRUDAYAME NAA TELUGU
…….SRIKAKULA…….

VAANA CHINUKULAKU BAYATA PADE VAJRALA GUNTAYE NAA TELUGU
VENNA GHUMA GHUMALA VENNALA JUNNULA CHALLA PALLIYE NAA TELUGU
…….SRIKAKULA………
NAVARAGAM NAA TELUGU...2








26, ఆగస్టు 2016, శుక్రవారం

బండి విరిచి పిన్న పాపలతో నాడిBANDI VIRICHI.. PINNA PAPALATO NADI



బండి విరిచి పిన్న పాపలతో నాడి
ధన్యాసి రాగం ,ఏక తాళం
BANDI VIRICHI.. PINNA PAPALATO NADI  

బండి విరిచి .. పిన్న పాపలతో నాడి….
దుండగీడు వచ్చే దోబూచి
దుండగీడు వచ్చే దోబూచి..2

పెరుగు వెన్నలు ప్రియమున
వే.మరుముచ్చు లిచ్చు మాయకాడు….
వెరపున ధన విధము దాచుకొని
దొరదొంగ వచ్చె దోబూచి..2
….బండి విరిచి…

పడచు గుబ్బెత పరుపుపై
పోక ముడికొంగు నిద్ర ముంపునను….
పడియుత వద్ద పవళించి నట్టి
తొడుకుదొంగ వచ్చె దోబూచి..2
….బండి విరిచి…

గొల్లపల్లెలో ఇల్లిల్లూ..చొచ్చి
కొల్లలాడిన కోడెకాడు….
యెల్లయిన వెంకటేశుడు ఇదె
తొల్లిటిదొంగ వచ్చె దోబూచి

బండి విరిచి .. పిన్న పాపలతో నాడి….
దుండగీడు వచ్చే దోబూచి
దుండగీడు వచ్చే దోబూచి
దుండగీడు వచ్చే దో.బూ..చి


BANDI VIRICHI.. PINNA PAPALATO NADI
DHANYASI RAGAM,  EKA TALAM

Bandi virichi .. pinna papalato nadi….
Dundageedu vache dobuchi

Perugu vennalu priyamuna
Ve.maru muchu lichu mayakadu….
Veraouna dhana vidhamu dhachukoni
Doradonga vache dobuchi
….bandi virichi….

Padachu gubbeta parupu pai
Poka mudikongu nidra mumpunaku
Padiyyta vadda pavalinchi natti
Todukudonga vache dibuchi
….bandi virichi….

Gollapallelo illillu.. Chochi
Kollaladina kodekadu….
Yellaina venkatesudu ide
Tillitidonga vachhe dobuchi

Bandi virichi .. pinna papalato nadi….
Dundageedu vache dobuchi
Dundageedu vache dobuchi
Dundageedu vache do.bu..chi

19, ఆగస్టు 2016, శుక్రవారం

కాశీపురాధీశ్వరి కరుణించు KASIPURADHISWARI



కాశీపురాధీశ్వరి కరుణించు
రచన,  సంగీతం : వేమూరి సరోజనీ శాస్త్రిగారు
ఆదితాళం

కాశీపురాధీశ్వరి కరుణించు
శ్రీకామేశ్వరి రాజరాజేశ్వరి
నిత్యాన్నధానేశ్వరి పరాత్పరి
అన్నపుర్ణేశ్వరి అఖిలాండేశ్వరి
కాశీపురాధీశ్వరి కరుణించు శ్రీకామేశ్వరి

సత్య స్వరూపిణి సదాశివుని రాణి
నిత్య కళ్యాణి దాక్షాయణి
కాశీపురాధీశ్వరి కరుణించు శ్రీకామేశ్వరి

మోక్షప్రదాయిని కాశీవిశాలాక్షి
ఙ్ఞాన బిక్ష నిడి పాలింపుమమ్మా
పదసరోజముల నమ్మితినమ్మా….అమ్మా..
పదసరోజముల నమ్మితినమ్మా
కృపచూడు శంకరి దయాసాగరి

కాశీపురాధీశ్వరి కరుణించు
శ్రీకామేశ్వరి రాజరాజేశ్వరి
నిత్యాన్నధానేశ్వరి పరాత్పరి
అన్నపుర్ణేశ్వరి అఖిలాండేశ్వరి
కాశీపురాధీశ్వరి కరుణించు శ్రీకామేశ్వరి


KASIPURADHISWARI
Rachana, sangeetam : vemuri sarojini sastri garu
Aditalam
Kasipuradhiswari karuninchu
Sri kameswari rajarajeswari
Nityanna Dhaneshwari paratpari
Annapurneshwari akilandeswari
Kasipuradhiswari karuninchu sri kameswari

Sathya Swarupini sadasivuni rani
Nithyakalyani dakshayani
Kasipuradhiswari karuninchu sri kameswari

Moksha Pradayini kasi visalakshi
Gnana bhiksha nidi palimpumamma
Pada saroja mula nammiti amma…..amma…
Pada saroja mula nammiti amma….
Krupschudu sankari dayasagari


Kasipuradhiswari karuninchu
Sri kameswari rajarajeswari
Nityanna Dhaneshwari paratpari
Annapurneshwari akilandeswari
Kasipuradhiswari karuninchu sri kameswari

14, ఆగస్టు 2016, ఆదివారం

తిధులు...వాటి ఫలితాలు

తిధులు...వాటి ఫలితాలు

పాడ్యమి  :  ఉదయం పనులకు మంచిది కాదు. తిధి అర్ధ భాగం తరువాత మంచిది.

విదియ. :  ఏకార్యము తల పెట్టిననూ శుభకరము.

తదియ. :  అన్ని కార్యములందు విజయం,  ఆనందం కలిగించును.

చవితి  :  మధ్యాహ్నం ఒంటిగంట తరువాత మంచిది.

పంచమి  :  శుభమునకు చిహ్నం. లాభము సమకూరును.

షష్ఠి  :  రాత్రి సమయము మంచిది.

సప్తమి  :  అన్ని కార్యములకు మంచిది.

అష్టమి  : మంచిది కాదు.

నవమి  :  మంచిది కాదు.

దశమి  :  అన్ని కార్యములకు విజయము.

ఏకాదశి  :  అన్ని కార్యములకు విజయము.

ద్వాదశి  :  ప్రయాణములకు ఆహారం తిని వెళ్ళినచో శుభప్రదం, లాభం కలుగును.

త్రయోదశి  :  అన్ని కార్యములందు విజయము కలుగును.

చతుర్ధశి  :  మంచిది కాదు.

పౌర్ణమి  :  అన్ని కార్యములకు విజయము కలుగును.

అమావాస్య. :  మంచిది కాదు.

12, ఆగస్టు 2016, శుక్రవారం

వరలక్ష్మీ తల్లి వ్రత విధానం

వరలక్ష్మీ తల్లి వ్రత విధానం



To See the File Click Here

క్రిష్ణా క్రిష్ణానది క్రిష్ణవేణీనది Krishna krishna Nadi

క్రిష్ణా క్రిష్ణానది క్రిష్ణవేణీనది

రచన,  సంగీతం : శ్రీమతి వేమూరి సరోజని శాస్త్రిగారు
శుద్ధధన్యాసి రాగం  ఏకతాళం

 AUDIO


క్రిష్ణా క్రిష్ణానది క్రిష్ణవేణీనది
కరుణించి కాపాడు కలకాలము తల్లి
క్రిష్ణా…..క్రిష్ణానది…..

మహాభక్తులు ఉదయించిన మహారాష్ట్ర నుండి కదిలి
పయనించి పయనించి తెలుగువారి నుద్దరింప
పరుగు పరుగున వచ్చిన పరమ పావని జననీ…….
పరుగు పరుగున వచ్చిన పరమ పావని జనని
పవిత్రముగా చేయుమమ్మ జనులందరిని
క్రిష్ణా…..క్రిష్ణానది…..

క్రిష్ణుని భుజము నుండి పుట్టితివి కనుక
నీవు క్రిష్ణాయను నామము బడసితివమ్మా
మార్గమందు వేణీ నదితో కలసి నీవు
క్రిష్ణవేణిగా ప్రసిద్ధి చెందినావమ్మ
క్రిష్ణా…..క్రిష్ణానది…..

విజయవాటిక యందు కనకదుర్గమ్మను
ఆనంద కెరటాల అర్చింతువమ్మా
నీ తీర్ధమందున పావనులై భక్త జనులు
పుణ్యరాసులను పొంది తరయింతురే తల్లి
క్రిష్ణా…..క్రిష్ణానది…..

నీ జలముల గృంకులిడి పునీతులైన జనులు
పుష్కరుని కూడిన నిను పూజించి సేవించి
పితురులను ధ్యానించి తర్పణాదులను నొసగి
ఇహపర సుఖముల నెల్ల పొందెదరే తల్లి
క్రిష్ణా క్రిష్ణానది క్రిష్ణవేణీనది
కరుణించి కాపాడు కలకాలము తల్లి
క్రిష్ణా…..క్రిష్ణానది…..



Krishna krishna nadi
krishna veni nadi

Rachana, sangeetam : Srimati vemuri sarojini sastri garu
Sudda dhanyasi ragam,  ekatalam

Krishna krishna nadi krishnaveni nadi
Karuninchi kapadu kalakalamu talli
Krishna….. krishna nadi

Maha bhakthulu udayinchina Maharashtra nundi kadali
Payaninche payaninche telugu vari nuddarimpa
Parugu paruguna vachina parama pavani janani…..
Parugu paruguna vachina parama pavani janani
Pavitramuga cheyumamma janulandarini
Krishna…..krishna nadi…..

Krishuni bhujamu nundi puttitivi kanuka
Nevu krishna yanu namamu badasitivamma
Margamandu veni nadito kalasi neevu
Krishnaveni ga prasiddi chendinavamma
Krishna….krishna nadi…..

Vijayavatika yandu kanakadurgamma nu
Ananda keratala archintuvamma
Nee teertha manduna paavanulai bakta janulu
Punya rasulanu pondi tarainture talli
Krishna …….krishna nadi….

Nee jalamula gruntikalidi puneetulaina janulu
Pushkaruni kudina ninu pujinchi sevinchi
Piturulanu dhyaninchi tarpanadulanu nosagi
ihapara sukhamula nella pondedare talli

Krishna krishna nadi krishnaveni nadi
Karuninchi kapadu kalakalamu talli
Krishna….. krishna nadi







3, ఆగస్టు 2016, బుధవారం

సముద్ర తనయే హే లక్ష్మి SAMUDRA TANAYE HAY LAKSHMI

సముద్ర తనయే హే లక్ష్మి
సంగీతం : ప్రణవి మొక్కరాల

కళ్యాణి రాగం , ఏకతాళం

Audio

పల్లవి :
సముద్ర తనయే హే లక్ష్మి
నారాయణ సతి శ్రీలక్ష్మి

చరణం :
పాల కడలిని చిలుకగ వెడలిన
చంద్ర సహోదరి  శ్రీలక్ష్మి
మెరుపు తీగలా కాంతులీనుచు
నారాయణుని పరిణయమాడిన

తామర పుష్ప సింహాసిని
సకలాభరణ అలంకారిణి
థ్యానమొసగే ధైర్యమొసగే
సంపదలొసగే తల్లివి నీవు

ధనలక్ష్మి ధాన్యలక్ష్మీ
ధైర్యలక్ష్మీ విజయలక్ష్మి
ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి
గజలక్ష్మి సంతానలక్ష్మి

SAMUDRA TANAYE HAY LAKSHMI

Sangeetam : Pranavi Mokkarala


Pallavi :
Samudra tanaye hay lakshmi
Narayana sati sri lakshmi

Charanam :
Pala kadalini  chilakaga vedalina
Chandra sahodari sri lakshmi
Merupu teegala  kantuleenuchu
Narayanuni parinayamadina

Tamara pushpa simhasini
Sakalabharana alamkarini
Dhyana mosagay dhairya mosagay
Sampada losagay tallivi neevu

Dhana lakshmi dhanya lakshmi
Dhairya Lakshmi vijaya lakshmi
Adi Lakshmi vidhyalakshmi gaja lakshmi santana lakshmi