16, సెప్టెంబర్ 2016, శుక్రవారం

క్షీరాబ్ధి కన్యకకుKSHIRABDHI KANYAKAKU


క్షీరాబ్ధి కన్యకకు

మధ్యమావతిరాగం, ఆదితాళము
గానం :శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు AUDIO

క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనం


జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కర్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువు మాణిక్యముల నీరాజనం


చరణ కిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివ నిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం


పగటు శ్రీ వేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కఁదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం
    
★★★


KSHIRABDHI KANYAKAKU


KSHIRABDHI KANYAKAKU SRI MAHALAKSHMIKINI
NIRAJALAYAMUNAKU NEERAJANAM


JALAJAKSHI MOMUNAKU JAKKAVA KUCHAMBULAKU
NELAKONNA KARPURAPU NEERAJANAM
ALIVENI TURUMUNAKU HASTA   KAMALAMBULAKU
NILUVU MANIKYAMULA NEERAJANAM


CHARANA KISALAYA MULAKU SAKIYARAMBHORULAKU
NIRATAMAGU MUTTELA NEERAJANAM
ARIDI JAGHANAMBUNAKU ATIVA NIJANABHIKINI
NIRATI NANAVARNA NEERAJANAM


PAGATU SRI VENKATESU PATTAPU RANIYAI
NEGADU SATI KALALAKUNU NEERAJANAM
JAGARI NALAMELMANGA CHAKKADANAMULAKELLA
NEGUDU NIJA SOBHANAPU NEERAJANAM

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి