12, అక్టోబర్ 2016, బుధవారం

అంబా లాలి జగదంబ లాలి

అంబా లాలి జగదంబ లాలిAudio

అంబా లాలి జగదంబా లాలి
కంభు కంఠు రాణి కళ్యాణి లాలి

త్రేతాయుగమున రాముని సతివై సీతాలాలి
ద్వాపర యుగమున క్రిష్ణుని సతివై రుక్మిణి లాలి
ఈ యుగమందున వెలసితివమ్మా అలివేలు మంగమ్మా
మల్లెల పానుపు వేశారమ్మ పవళింపవే అమ్మా
…...అంబా లాలి జగదంబ లాలి……

పట్టు పానుపు పరిచారమ్మా పార్వతి లాలి
జోలపాడి జో కొడతాము జ్యోత్స్నా లాలి
లాలి పాడి లాలించేము లలితా లాలి
అలసి సొలసి ఉన్నావమ్మా  నిదురింపరావమ్మా.
…..అంబా లాలి జగదాంబ లాలి….

కంచిలోన వెలసితివమ్మా కామాక్షిగ నీవు
మధురలోన వెలసితివమ్మా మీనాక్షిగ నీవు
కాశిలోన వెలసితివమ్మా అన్నపూర్ణగా నీవు
జోలపాడి జో కొడతాను నిదురింపరావమ్మా
….అంబా లాలి జగదంబా లాలి…..

మాగృహమందున వెలసితివమ్మా మహలక్ష్మిగ నీవు
జాజుల పానుపు వేశారమ్మా పవళింపరావమ్మా
జలకములాడి అలసితివమ్మా జలజాక్షి నీవు
ఊయల లూపి లాలి పాడెద నిదురింప రావమ్మ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి