19, అక్టోబర్ 2016, బుధవారం

ఇతడెవరమ్మా..ఇతడెవరమ్మా..

రాగం : బృందావన్ సారంగ్ఆది తాళము. రచన : శ్రీ కూచిమంచి సోమసుందరకవిస్వరకల్పన : శ్రీమతి వేమూరి సరోజనీశాస్త్రి


పల్లవి :
ఇతడెవరమ్మా ఇతడెవరమ్మా
యీ నిక్షేపము ఎక్కడిదమ్మా  
అతివరో యొకవైపు సతియు నొకవైపు పతియునై యున్నాడు
…..ఇతడెవరమ్మా…..

చరణం :
తలయెల్ల జడలు
తెల్లని భస్మమలదినయొడలు తళుకారు జీవరత్నములు పడగలనున్న
చిలువల బారులు చెలువైన పేరులు
...ఇతడెవరమ్మా….

సిగనొక్క యేరు మిన్నందివాసిగజాలువారు
అదివో కన్నులు మూడు నీలి కంఠము వాడు
జగములయందింత సొగసు కాడేలేడు
…ఇతడెవరమ్మా……

నందివాహనుడే రూపున జగదృందమోహనుడే
అందమైన యట్టి మందహాసము తోడ
సుందరదాసుని ముందరనున్నాడు

ఇతడెవరమ్మా ఇతడెవరమ్మా
యీ నిక్షేపము ఎక్కడిదమ్మా  
అతివరో ఒకవైపు
సతియు యొకవైపు పతియునై యున్నాడు
ఇతడెవరమ్మా …..ఇతడెవరమ్మా….

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి