ఘల్లు ఘల్లున
ఘల్లు ఘల్లున పాద గజ్జెలందెలు మ్రోయ
కలహంస నడకల కలికి ఎక్కడికే….2
జడలోన గంగను ధరియించుకొన్నట్టి
జగమేలే సాంబశివుని సన్నిధికే
మంగళం మంగళం..
మాతల్లికి మంగళం మంగళం.
తళ తళమని రత్న తాటంకములు మెరయ
పసిడి కుండళముల పడతి ఎక్కడికే…2
కరిచర్మాంబర ధరుడు మురహరుడైనట్టి
గురుడైన భోళాశంఖరుని సన్నిధికే
మంగళం మంగళం
మాతండ్రికి మంగళం మంగళం
చెంగావి చీరలు కొంగులు జారంగ
రంగైనా నవమోహనాంగి ఎక్కడికే..2
పులితోలు వస్త్రము విభూతి ధరియించిన
మండలమేలే జగదీశుని సన్నిధికే
మంగళం మంగళం
మాతల్లికి మంగళం మంగళం
బొడ్డు మల్లెలు జాజిదండలు మెడనిండ
అందమెరిగిన జగదాంబ ఎక్కడికే ?
అందముగా విభూతి నలరు శ్రీగ్రంధము
అలరీన నీలకంఠేశుని సన్నిధికే
మంగళం మంగళం
మా తండ్రికీ మంగళం మంగళం
హెచ్చు పాపిటబొట్టు రత్నకిరీటము
ఈవేళ కరుణా కటాక్షి ఎక్కడికే...2
కడుపెద్ద రుద్రాక్షలు మెడలోన హరములు
శిఖరాన వెలసిన శివుని సన్నిధికే
మంగళం మంగళం
మాతల్లికీ మంగళం మంగళం
మాతండ్రికి మంగళం మంగళం.
ఈ పాట సాహిత్యమూ, ఆడియో పంచుకున్నందుకు ధన్యవాదాలండి. సాహిత్యం రాసినవారెవరో తెలిస్తే చెప్పగలరు.
రిప్లయితొలగించండితీయగా, చక్కగా పాడినవారి పేరుకూడా రాసుంటే బాగుండేది :-)