29, నవంబర్ 2016, మంగళవారం

Veedha Manthramu Neevu/వేద మంత్రము నీవు

వేద మంత్రము నీవు
రచన : నూజిళ్ళ శ్రీనివాస రావు ,
సంగీతం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీ గారు
మధ్యమావతి రాగం , ఖండగతి తాళం
శంకరా…..శంకరా…. శంకరా….

వేదమంత్రము నీవు వేద శబ్దము నీవు
వేదార్ధ మెరగించు వేత్త నీవు
వేద పురుషుల సేవ చేయు సద్గుణ మిమ్ము
శంకరా నీకిదె నీరాజనం...2

నారాయణుని దివ్వనామ మహిమను తెలిపి
గణపతికి , ఆదిపత్య మొసగితివి
సాటి మనుషుల గొప్ప ఒప్పుకొను గుణ మిమ్ము
శంకరా నీకిదే నీరాజనం….2

క్షీరసాగర మదన వేళ గరళము తాగి అమృతము సురలకు అందించినావు
పరుల కొరకై బతుకు మనసు మాకిమ్మురా
శంకరా నీకిదే నీరాజనం...2

ఆది బిక్షవు నీవు ఆది గురుడువు నీవు
ఆది చైతన్య రూపమ్ము నీవు
ఆది అంతము లేని లింగ రూపివి నీవు
శంకరా నీకిదే నీరాజనం..4
నీరాజనం….నీరాజనం….
నీ రా జ నం

28, నవంబర్ 2016, సోమవారం

Enta pani chesitivi rama ఎంత పని చేసితివి రామా

ఎంత పని చేసితివి రామా
ఖండగతి తాళం , నాదనామ క్రియ రాగం
                            Audio
ఎంత పని చేసితివి రామా నిన్నేమనందును సార్వభౌమా
పంతమా నా మీద పరమ పావన నామ
సంతోష ముడిపితివి సకల సద్గుణధామ
ఎంతపనిచేసితివి రామా
…..ఎంతపని….

నిన్నే దైవంబనుచు నమ్మి
తిన్నగా దుఃఖముల జిమ్మి
కన్న దినమని నమ్మి నిన్ను సేవింపగా
మున్నీట నన్నిట్లు ముంచుటెరుగక పోతి
ఎంతపని చేసితివి రామా
……..ఎంత పని……..

అన్నన్న మాట్లాడవేరా నీ కన్నులను నను చూడవేరా
చిన్నెలన్నియు తరిగియున్న నా చిన్నన్న క్రన్నా నను చూడు మాయన్న ఓ రామన్న
ఎంత పని చేసితివి రామా
…...ఎంత పని……

భద్రాద్రి వాసుడే యనుచు మమ్ము నిరుపద్రవముగా యుండు మనుచు
రుద్రనుత కరుణా సముద్ర ఓ శ్రీరామ భద్ర , నిన్నె మదిని భద్రముగా నమ్మితిని
ఎంత పని చేసితివి రామా

ఎంత పని చేసితివి రామా నిన్నేమనందును సార్వభౌమా
ఏమనందునుసార్వభౌమా...
నిన్నే మనందును సార్వ భౌమా….2




22, నవంబర్ 2016, మంగళవారం

అన్ని మంత్రములు

అన్ని మంత్రములు
Audio
అన్ని మంత్రములు ఇందే ఆవహించెను
వెన్నతో నాకు కలిగే వేంకటేశు మంత్రము

నారదుడు జపియించే నారాయణ మంత్రము
చేరే ప్రహ్లదుడు నారసింహ మంత్రము
కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము
వేరే నాకు కలిగే వేంకటేశు మంత్రము

రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపియించె
అంగవించె క్రిష్ణ మంత్రము అర్జనుడును
ముంగిట విష్ణు మంత్రము మొగి శుకుడు పఠించె
వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము

ఇన్ని మంత్రముల కెల్ల ఇందిరా నాథుడే గురి
పన్నిన దిదియే పరబ్రహ్మ మంత్రము
నన్ను కావ గలిగెపో నాకు గురుడియ్యగాను
వెన్నెల వంటిది శ్ర్రీ వేంకటేశు మంత్రము

20, నవంబర్ 2016, ఆదివారం

అన్నమాచార్యుని ప్రార్ధన


అన్నమాచార్యుని ప్రార్ధన
                   

శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా...2
పీత్వాపినైవ సుహిజా మనుజా భవేయుః...2
త్వం వేంకటా చలపతేరివ భక్తిసారం...2
శ్రీ తాళ్ళపాక గురుదేవ...2
నమో నమస్తే...2

19, నవంబర్ 2016, శనివారం

ఆడరో పాడరో

ఆడరో పాడరో
Audio

ఏకతాళం రామక్రియ రాగం
పల్లవి :
ఆడరో పాడరో అప్సరో గణము
వీడెము లిందరో విభవము నేడు
చరణం :
కమలారమణుని కళ్యాణమునకు
తమినదె గరుడ ధ్వజమొసగే
తెమలుచు మ్రోసెను దివ్యదుందువులు
గమనించరో దివిగల దేవతలు

వెలయగ లక్ణ్మీ విభుని పెండ్లికిని
బలసి అంకురార్పణ మదివో
కలగొన నిచ్చేరు గంధాక్షతలవే
చెలగి గైకొనరో శ్రీ వైష్ణవులు

బడి శ్రీ వెంకట పతికి శ్రీ సతికి
అడరిన తలంబాలందెనిదె
నడచీ పరుషులు  నానా ముఖముల
ముడుపులు చదవరో ముయి గానరులు





17, నవంబర్ 2016, గురువారం

షోడస కళానిధికి

షోడస కళానిధికి

లలితరాగం, ఆదితాళము

Audio

పల్లవి :

షోడస కళానిధికి షోడశోపచారములు
షోడస కళానిధికి షోడశోపచారములు
జాడతోడ నిచ్చలును సమర్పయా..మి
జాడతోడ నిచ్చలును సమర్పయామి..2

చరణం :
అలరు విశ్వాత్మకునకు ఆవాహన మిదె
సర్వ నిలయునకు ఆసనము నెమ్మి నిదే
అలగంగా జనకునకు అర్ఘ్య పాద్యా అచమనాలు
జలధి శాయికిని మజ్జన మిదే….
….......షోడస కళానిధికి ………...

వర పీతాంబరునకు వస్త్రాలంకార మిదె
సరి శ్రీమంతునకు భూషణము లివే
ధరణీ ధరునకు గంధ పుష్ప ధూపములు
తిరమిదే కోటి సూర్య తేజునకు దీపము
….......షోడస కళానిధికి ………...

అమృత మథునునకు అదివో నైవేద్యము

గమి చంద్ర నేత్రునకు కప్పుర విడెము
అమరిన శ్రీవెంకటాద్రి మీది దేవునకు
తమితో ప్రదక్షిణాలు దండములు ఇవిగో
….......షోడస కళానిధికి …………

షోడస కళానిధికి షోడశోపచారములు
జాడతోడ నిచ్చలును సమర్పయా..మి
జాడతోడ నిచ్చలును సమర్పయామి
సమర్పయామి…..సమర్పయామి. .....3

12, నవంబర్ 2016, శనివారం

భో శంభో శివశంభో స్వయంభో

భో శంభో శివశంభో స్వయంభో
రేవతి రాగం, ఆదితాళము
రచన : శ్రీ దయానంద సరస్వతి
పల్లవి :
భో శంభో శివశంభో స్వయంభో
భో శంభో శివశంభో స్వయంభో
భో శంభో శివశంభో స్వయంభో

భో శంభో శివశంభో స్వయంభో…..
భో శంభో శివశంభో స్వయంభో

అను పల్లవి :
గంగాధరా శంకర కరుణాకర మామవ భవసాగర తారక
భో శంభో శివశంభో స్వయంభో…..
భో శంభో శివశంభో స్వయంభో

చరణం :
నిర్గుణ పరబ్రహ్మ స్వరూప
గమాగమ భూత ప్రపంచ రహిత
నిజగుహ నిహిత నితాంత అనంత
ఆనంద అతిశయ అక్షయ లింగా
భో శంభో శివశంభో స్వయంభో…..
భో శంభో శివశంభో స్వయంభో

ధిమిత ధిమిత ధిమి ధిమికిట కిట తోం
తోం తోం తరికిట తరికిట కిటతోం
మతంగ మునివర వందిత ఈశా
సర్వ దిగంభర వేశ్టిత వేశా
నిత్య నిరంజన నృత్య నటేశా
ఈశా సభేశా సర్వేశా…

భో శంభో శివశంభో స్వయంభో…..
భో శంభో శివశంభో స్వయంభో
శివశంభో స్వయం భో
శివశంభో స్వయం భో 

9, నవంబర్ 2016, బుధవారం

సీమంతము పాట

సుదతులందరు
సీమంతము పాట
            Audio
సుదతులందరు గూడి సిరులొలుకు శ్రీలక్ష్మి సీమంతమునకు రారండి...2

శ్రీరామచంద్రుని గుణగణములు కల్గి
ఆ రామ భక్తుని బలము తేజము కల్గి
బృహస్పతిని మించి బుద్ది బలముకల్గి
చిరంజీవు కనమని సంతసము
దీవించా
సుదతులందరు గూడి సిరులొలుకు శ్రీలక్ష్మి సీమంతమ్మునకు రారండి

ముగ్గురమ్మల శక్తి మూలముగా కల్గి
ఇరు వంశములకు మణిగా వెల్గి
విజయలక్ష్మిగా ఘనత వహించి
తల్లిగా మారే తనయని కనమని సుదతులందరు గూడి సిరులొలుకు శ్రీలక్ష్మి సీమంతమ్మునకు రారండి

ఏడుకొండలవాడి కొండంత అండతో
పండులాంటి బిడ్డను కనమని దీవించ
మంగళాంగులు మంగళమని పాడ
మంగళగౌరి సుమంగళిగా దీవించ
సుదతులందరు గూడి సిరులొలుకు శ్రీలక్ష్మి సీమంతమ్మునకు రారండి
సీమంతమ్మునకు రారండి
సీమంతమ్మునకు రారండి

శ్రీ సత్యన్నారాయణుని సేవకు రారమ్మ


శ్రీ సత్యన్నారాయణుని సేవకు రారమ్మ
Audio
శ్రీ సత్యన్నారాయణుని సేవకు రారమ్మ
మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా
నోచిన వారికి నోచిన ఫలము చూచిన వారికి చూచిన వరము
శ్రీ సత్యన్నారాయణుని సేవకు రారమ్మ
మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా

స్వామిని పూజించే చేతులే చేతులటా….
ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులటా
తన కధ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునటా…..
శ్రీ సత్యన్నారాయణుని సేవకు రారమ్మ
మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా

ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం
అన్నవరం లో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం
శ్రీ సత్యన్నారాయణుని సేవకు రారమ్మ
మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా

అర్చన చేద్దామామనసు అర్పణ చేద్దామా
స్వామికి మదిలోనే కోవెల కడదామా
పదికాలాలు పసుపుకుంకుమలు ఇమ్మని కోరేదమా
శ్రీ సత్యన్నారాయణుని సేవకు రారమ్మ
మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా

మంగళమనరమ్మా
జయ మంగళమనరమ్మా
కరములు జోడించి శ్రీచందనమలరించి
మంగళ మనరే  సుందరమూర్తికి వందనమనరమరమ్మా

శ్రీ సత్యన్నారాయణుని సేవకు రారమ్మ
మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా
మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా