సీతా కళ్యాణ వైభోగమే
శంకరాభరణ రాగం, ఖండచాపు తాళం
పల్లవి :
సీతా కళ్యాణ వైభోగమే రామా కళ్యాణ వైభోగమే
చరణం :
పవనజా స్తుతి పాత్ర పావన చరిత్ర
రవి సోమ వరనేత్ర రమణీయ గాత్ర
…..సీతా….
భక్త జన పరిపాల భరిత శరజాల
భుక్తి ముక్తిద లీల భూదేవ పాల
….సీతా ….
పామరాసుర భీమ పరిపూర్ణ కామ
శ్యామ జగదభి రామ సాకేత ధామ
…...సీతా….
సర్వ లోకాధార సమరైక ధీర
గర్వ మానస దూర కనకాంగ వీర
…..సీతా…..
నిగమాగమ విహార నిరుపమ శరీర
నగధ రాఘ విధార నత లోకధారా
…..సీతా…..
పరమేశనుత గీత భవ జలధి పోత
ధరణి కుల సంజాత త్యాగరాజ
నుత
…..సీతా……
సౌభాగ్యమే….వైభోగమే
సీతా కళ్యాణమే… రామ వైభోగమే
కళ్యాణమే ….వైభోగమే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి