8, డిసెంబర్ 2016, గురువారం

నా పాలి శ్రీరామ

నా పాలి శ్రీరామ
శంకరాభరణ రాగం,  ఆది తాళము ( నలుగు పాట)
పల్లవి :
నా పాలి శ్రీరామ భూ పాలక సోమ
కాపాడ సమయము నీ పాదము లీడ

చరణం :
భళి భళి భక్తుల పూజా ఫలమేమో
నళిన లోచన నీకు నలుగు పెట్టెదరా

కోటి మన్మధులైన సాటిరాని నీ సొగసు
నాటి వున్నది మదిని మేటి శ్రీరామ

తొలిపూజ ఫలమేమో కలిగే నీ పదసేవ
నలువకైనను నిన్ను తెలియగ తరమా

పతిత పావన నీవు పాలించకుంటేను
గతి మాకెవ్వరు మమ్ము గ్రక్కున బ్రోవు

నిరుపేద కబ్బిన నిధి రీతి దొరికితివి
వర త్యాగరాజు నీకు వరద మ్రోక్కెదరా...3



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి