నగు మోము కలవాని
మధ్యమావతి రాగం, ఆది తాళము
పల్లవి :
నగుమోము కలవాని నా మనోహరునీ
జగమేలు సురూని జానకీ వరునీ
….నగుమోము…….
చరణం :
దేవాది దేవుని దివ్యా సుందరునీ
శ్రీ వాసుదేవుని సీతారాఘవుని
సుజ్ఞాన నిధిని సోమ సూర్య లోచనుని
అజ్ఞాన తమమును అణుచు భాస్కరుని
నిర్మలా కారుని నిఖిలాగా హరునీ
ధర్మాధి మోక్షంబు దయసేయు ఘనునీ
భోధాతో పలుమారు పూజించి మేమా
రాధించు శ్రీ త్యాగరాజా సన్నుతునీ
నగుమోము గలవాని నా మనోహరునీ
జగమేలు సురూని జానకీ వరునీ నగుమోము కలవాని నా మనోహరునీ….
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి