2, డిసెంబర్ 2016, శుక్రవారం

వందనము రఘు నందన - Vandhanamu Raghu Nandana

వందనము రఘు నందన

శెహన రాగం, ఆదితాళము

పల్లవి :
వందనము రఘు నందన
వందనము రఘు నందన సేతుబంధన భక్తచందన రామా
వందనము రఘు నందనా

చరణం :
శ్రీదమా నాతో వాదమా
నే భేధమా ఇది మోదమా రామా
వందనము రఘునందనా

శ్రీ రమాహృచ్ఛారమా
బ్రోవ భారమా రాయబారమా రామా
వందనము రఘు నందనా

వింటిని నమ్ముకొంటిని
శరణంటిని రమ్మంటిని రామా
వందనము రఘు నందనా

ఓడను భక్తి వీడను
ఒరుల వేడను నీవాడను రామా
వందనము రఘునందనా

క్షేమము దివ్య ధామము
నిత్య నేమము రామనామము రామా
వందనము రఘునందనా

వేగరా కరుణా సాగరా
శ్రీ త్యాగరాజ హృదయాకరా రామా

వందనము రఘు నందన సేతుబంధన భక్తచందన రామా
వందనము రఘునందన
రఘునందన….ర ఘు నం ద నా…



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి