29, జనవరి 2017, ఆదివారం

Kalalu kane kanne pilla కలలు కనె కన్నెపిల్ల గోదాదేవి పాశురం .1

కలలు కనె కన్నెపిల్ల 1.పాశురం
రచన :పి.యల్.యన్.ప్రసాద్
సంగీతం ,గానం :యమ్. యశోధరగారు మోహనరాగం, ఆదితాళం


పల్లవి :--
కలలు కనె కన్నెపిల్ల కళ్ళు తెరిచి చూడవే
కన్నయ్యను నిదుర లేపి మేలుకొనవే మానినీ


చరణం :--
నీలివన్నెకాడిని మనువాడ గోరితే
నిలువునా నీట మునిగి కాత్యాయనీ వేడవే
మనసులోని మాటను తల్లికి చెప్పవే
మహిమగల మార్గళి నోము నీవు నోచవే
నంద నందనుడే వాడు సింగపూ కూనలే
బృందావన ధీరుకూడి పూలు పళ్ళు మేళాలను
తొలిజామున కూర్చవే……..


కలలు కనె కన్నెపిల్ల కళ్ళు తెరిచి చూడవే
కన్నయ్యను నిదుర లేపి మేలుకొనవే మానినీ


హరి కోరితే నీవు సిరి నోము నోచవే
హరి పూజలే నీకు వరములై నిలుచేనే
నీ తాళి కాచేటి యా దేవ దేవిని
పార్వతీదేవి పాదాలకు మ్రొక్కవే….
గోకులం మందలి గోపకాంతలందరును
నోములీ రీతిగా నోచేరు చూడవే
లోకాలన్నింటికి సౌభాగ్యదాయకం
కన్నెలందరికిది కళ్యాణ కారకం


కలలు కనె కన్నెపిల్ల కళ్ళు తెరిచి చూడవే
కన్నయ్యను నిదుర లేపి మేలుకొనవే మానినీ.2

మేలుకొనవే మానినీ….మేలుకొనవే మానినీ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి