29, జనవరి 2017, ఆదివారం

గోదాదేవి పాశురం -2

గోదాదేవి పాశురం -2
రచన :డా.పి యల్ .యన్ ప్రసాదుగారు
సంగీతం ,గానం : యం. యశోధరగారు
రాగం : వలాజి రాగం

కలలు కనే కన్నెపిల్ల కళ్ళు తెరిచి చూడవే
కన్నయ్యని నిదరలేపి మేలుకొనవే మానినీ

కామితమ్ము పొందగా కలువ కన్నెలారా మీరు
ధర్మంబు తప్పక ధనుర్మాస నోముతో
సరిగంగ స్నానాల సరిచేయరే భామిని
మనసులోని మురికి కడిగి ముగ్గులేయి మానిని

కలలు కనే కన్నెపిల్ల కళ్ళు తెరిచి చూడవే
కన్నయ్యని నిదరలేపి మేలుకొనవే మానినీ

కాటుకల సింగారము కన్నయ్య కు ఒసగవే
పూలుజడను ముడవక పద్మనాభు కీయవే
పాలుమీగడల కూర్చి పూతనారి కీయవే
లోకాలకిదే సౌభాగ్య దాయకం కన్నెలకిదే కళ్యాణ కారకం

కలలు కనే కన్నెపిల్ల కళ్ళు తెరిచి చూడవే
కన్నయ్యని నిదరలేపి మేలుకొనవే మానిని
కలలు కనే కన్నెపిల్ల కళ్ళు తెరిచి చూడవే
కన్నయ్యను నిదరలేప మేలుకొనవే మానిని
మేలుకొనవే మానినీ

మేలుకొనవే మానినీ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి