29, జనవరి 2017, ఆదివారం

Daya chudumaya దయ చూడుమయా

దయ చూడుమయా
గానం :  మోచర్ల సుధావల్లిగారు


పల్లవి :
దయ చూడుమయా తిరుమల నిలయా..2
భక్తుల మొర విని పాలించుమయా
……..దయచూడుమయా……


చరణం :
ఏతావు నుండైనా నీ కొండ చేరేము
ముడుపులు తెచ్చెము కన్నతండ్రి నీకు
అజ్ఞానులము మా అపరాధముల సైచి
ఆదుకోవేమయ్య ఏడుకొండలవాడ
…..దయచూడుమయా…..


పిలిచిన పలికే దైవము నీవని
కలియుగమందున ఘనత కాంచితివి
చల్లని స్వామి శ్రీవెంకటేశ
మొరవినమేమయ్య ఓ శ్రీనివాస
…...దయచూడుమయా…..


ఇల వైకుంఠము తిరుపతి కొండ
నిత్యకళ్యాణముగా నిలయము నీకొండ
ఆ కొండపై నీవు అలివేలు మంగతో
ఆనందమున తేలి నను మరచినావా


దయ చూడుమయా తిరుమల నిలయా
భక్తుల మొరలను విని పాలించుమయా

దయ చూడుమయా తిరుమల నిలయా…..

2 కామెంట్‌లు:

  1. అజ్ఞానులము మా అపరాధముల 'సైచి' ? I think అజ్ఞానులము మా అపరాధముల 'గాంచి' 

    రిప్లయితొలగించండి
  2. Also, నిత్యకళ్యాణముల నిలయము నీ కొండ is the correct line.

    రిప్లయితొలగించండి