29, జనవరి 2017, ఆదివారం

గోదాదేవి పాశురం-3

గోదాదేవి పాశురం-3
సంగీతం, గానం :యం యశోధరగారు
రచన : డా.పి యల్ యన్. ప్రసాదుగారు
ఆనందభైరవిరాగం

కలలు కనె కన్నె పిల్ల కళ్ళు తెరిచి చూడవే
కన్నయ్యను నిదుర లేపి మేలుకొనవే మానినీ

బుడి బుడి అడుగులు నడిచి వడుగే వచ్చి అడిగేనే
మూడడుగులు తానే కోరి ముల్లోకాలు నిండేనే
పాతాళమునకే బలినే పంపినా
పరిరక్షకుడై  నిలిచెనే
ఆ పొట్టివాని పట్టవే పాదాలకు మొక్కి నిదుర లేపరే

కలలు కనె కన్నె పిల్ల కళ్ళు తెరిచి చూడవే
కన్నయ్యను నిదుర లేపి మేలుకొనవే మానిని

భూమాత మురియగా పాలు చేలు పొంగగా
గోవుల సిరులన్నీ నిలువ కాత్యాయని కొలువవే
పిల్లా పాపలందరూ పల్లెల్లో చిందులేయగా
లోకాలకిదే సౌభాగ్యం
కన్నెలకిదే కళ్యాణ కారకం

కలలు కనె కన్నె పిల్ల కళ్ళు తెరిచి చూడవే
కన్నయ్యను నిదుర లేపి మేలుకొనవే మానినీ
కన్నయ్యను నిదుర లేపి మేలుకొనవే మానినీ
మేలుకొనవే మానినీ  మేలుకొనవే మానినీ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి