ఇదిగో భద్రాద్రి
వరాళి రాగం……..ఆది తాళం
ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి
ముదముతో సీత
ముదితలక్ష్మణుడు
కదసి కొలువగా రఘుపతి యుండెడి
….ఇదిగో భద్రాద్రి…..
చారు స్వర్ణ ప్రాకార గోపుర
ద్వారములతో సుందరమై యుండెడి
….ఇదిగో భద్రాద్రి…..
అనుపమానమై అతి సుందరమై
తనరు చక్రముతో ధగ ధగ మెరిసెడి
….ఇదిగో భద్రాద్రి…..
కలియుగమందున ఇల వైకుంఠము
అలరు చున్నది నయముగ మ్రొక్కుము
….ఇదిగో భద్రాద్రి…..
శ్రీ కరముగ నిల రామదాసుని
ప్రాకటముగ బ్రోచే ప్రభువాసము
ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి
ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి
గౌతమి అదిగో చూడండి
గౌతమి అదిగో చూడండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి