8, ఫిబ్రవరి 2017, బుధవారం

Kalalu kane kannepilla కలలు కనే కన్నెపిల్ల. గోదాదేవి పాశురం-4

గోదాదేవి పాశురం-4
రచన : డా. పి. యల్. యన్.ప్రసాద్ గారు
సంగీతం :యం . యశోధరగారు
భాగీశ్వరీ రాగం


కలలు కనె కన్నెపిల్ల కళ్ళు తెరిచి చూడవే
కన్నయ్యను నిదుర లేప మేలుకొనవే మానినీ


సిరి సిరి నవ్వుల చూపులు నారినే కూర్చగా
హరి ధనువు అమరింది హరిణాక్షి తో
శార్ధమే ఎత్తగా పాంచజన్య మురమగా
సుదర్శన దివ్య కాంతుల మెరుపులే మెరిసెను


కలలు కనె కన్నెపిల్ల కళ్ళు తెరిచి చూడవే
కన్నయ్యను నిదుర లేప మేలుకొనవే మానినీ


కురిసింది కురిసింది హరి కరుణామృతం
హరి శరములే వరములయి వానగా కురియగా
వరిచేను పొంగేను గాదెలే నిండేను
పిల్లల నవ్వులే ఏరులై పారేను
కన్నెలా కోర్కెల కొలువుండ రమ్మనవే


కలలు కనె కన్నెపిల్ల కళ్ళు తెరిచి చూడవే
కన్నయ్యను నిదుర లేప మేలుకొనవే మానినీ


నీలి మబ్బు వన్నెకాడు నాచేయి పట్టరావ
నా నోములే పండగా తాళి కట్టు దైవమాయని
పులకింతల వేడవే వరము కోరు వామాక్షి
లోకాలకు కిదే సౌభాగ్యం దాయకం కన్నెలందరికిదే కళ్యాణ కారకం


కలలు కనె కన్నెపిల్ల కళ్ళు తెరిచి చూడవే
కన్నయ్యను నిదుర లేప మేలుకొనవే మానినీ
కన్నయ్యను నిదుర లేప మేలుకొనవే మానినీ

మేలుకొనవే మానినీ ….మేలుకొనవే మానినీ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి