8, ఫిబ్రవరి 2017, బుధవారం

Murisipovu mudda banti మురిసిపోవు ముద్దబంతి గోదాదేవి పాశురం-5

గోదాదేవి పాశురం-5
రచన : డా. పి యల్. యన్ . ప్రసాద్ గారు
సంగీతం , గానం : యం.యశోధరగారు
సింధుభైరవి రాగం


మురిసిపోవు ముద్దబంతి మురిపాల మోహనాంగి
కలలలోన తేలిపోక కళ్ళు తెరచి చూడవే
కళ్ళు తెరచి చూడవే


దర్శనమే మోహనం నీ దర్శనమే మోహనం
దొరకవే యని యశోద వేడిన రోటి తోడ నిలచిన లీలా దర్శనం
కంసునికి చూపిన అతి భయంకర దర్శనం
గోపికా మానస నవనీత చోర దర్శనం శరణాగతితో నిలిచిన వారికి  శరణాగతితో నిలిచిన వారికి నీ మోహన దర్శనం


మురిసిపోవు ముద్దబంతి మురిపాల మోహనాంగి
కలలలోన తేలిపోక కళ్ళు తెరచి చూడవే


నీవే దిక్కని అడిగిన వారికి మనసున నమ్మి కొలిచినవారికి
పాపాలన్ని పరిహారం చేసెడి నీ పులకితమైన పావన దర్శనం
కన్నెల వలపులలో నీ కళ్యాణ దర్శనం లోకాలకిదే సౌభాగ్యదాయకం కన్నెలకిదె కళ్యాణ కారకం


మురిసిపోవు ముద్దబంతి మురిపాల మోహనాంగి
కలలలోన తేలిపోక కళ్ళు తెరచి చూడవే
కలలలోన తేలిపోక కళ్ళు తెరచి చూడవే

కళ్ళు తెరచి చూడవే ...కళ్ళు తెరచి చూడవే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి