8, ఫిబ్రవరి 2017, బుధవారం

Bhalira viragyamento భళిరా వైరాగ్యమెంతో

భళిరా వైరాగ్యమెంతో
కళావతి రాగం (త్యాగరాజ సంప్రదాయం)
యాగప్రియ రాగం(దీక్షితార్ సంప్రదాయం)
ఆదితాళం


పల్లవి :
భళిరా వైరాగ్యమెంతో బాగై యున్నది
చెంచలమయిన నా మనస్సు నిశ్చలమై యున్నది
భళిరా…...ఆ….ఆ….ఆ…..


చరణం :
అరి షడ్వర్గములు నన్నంటకున్నవి
శ్రీ హరి నామ స్మరణ జిహ్వకు అనువై
యున్నది
…..భళిరా……


గురుధ్యాన మందే మనస్సు కుదురైయున్నది
చిత్త ఇరువది ఆరింటి మీద తిరమై యున్నది
…..భళిరా……..


పరమ శాంత మెన్నగాను బాగై ఉన్నది
మాకు పరతత్వమందే బుద్ది పట్టి యున్నది
…..భళిరా…….


గురి భద్రాధీశు నందే గురుతై యున్నది
ఎప్పుడరమర లేక రామదాసు డనదగి యున్నది
...భళిరా…….


భళిరా వైరాగ్యమెంతో బాగైయున్నది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి