శ్రీరామ నీనామ మేమి రుచిరా
శ్రీరామ నీనామ మేమి రుచిరా
ఓరామ నీనామ మెంత రుచిరా
కరిరాజ ప్రహ్లాద ధరణీజా విభీషుణులు
గాచిన నీనామ మేమి రుచిరా
కదళీ కర్జూరాది ఫలముల కధికమ్ము...2
పతిత పావన నామ మేమి రుచిరా
పతిత పావన నామ మెంత రుచిరా …….శ్రీరామ నీనామ ….
అంజనా తనయా హృద్ కంజా ధళము నందు
రంజిల్లు నీనామ మేమి రుచిరా
సదాశివుడు నిన్ను సదా భజించెడి...2
సదానందా నామ మేమి రుచిరా
సదానందా నామ మేమి రుచిరా…...
శ్రీరామ నీనామ…..
తుంబురు నారదులు ఢంబు మీరగా
గానంబు చేసిన నామ మేమి రుచిరా
అరయా భద్రాచల శ్రీరామదాసుని...2
ఏలిన నీనామ మేమి రుచిరా
ఏలిన నీనామ మెంత రుచిరా……...
శ్రీరామ నీనామ…….
ఏమి రుచిరా మెంత రుచిరా...2
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి