8, ఫిబ్రవరి 2017, బుధవారం

Taraka mantramu తారకమంత్రము

తారకమంత్రము
ఆది తాళం………....ధన్యాసి రాగము

పల్లవి:
తారకమంత్రము కోరిన దొరికెను ధన్యుడనయితిని ఓరన్నా..
అను పల్లవి:
మీరిన గాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మక యున్నా...ఆ...ఆ…


చరణం:
మచ్చిక తో ఇతరాంతరంబుల మాయలలో పడబోకన్నా...
హెచ్చుగా  నూట ఎనిమిది తిరుపతు లెలిమి
తిరుగ పని లేదన్నా…...ఆ….ఆ …….“తారక”


ముచ్చటగా ’నా’ పుణ్యనదులలో మునుగుట పని ఏమిటి కన్నా…..
వచ్చెడి పర్వపు దినములలో సుడివడియుట మానక యున్నా...ఆ..ఆ…... “తారక”


ఎన్ని జన్మముల ఎరుక తో చూచిన ఏకో నారాయణుడన్నా….
అన్ని రూపులై యున్న పరాత్పరు నా మహాత్ముని కథ విన్నా….ఆ….ఆ…”తారక”


ఎన్ని జన్మములు చేసిన పాపము ఈ జన్మముతో విడునన్నా….
అన్నిటికీ కడసారి జన్మమిది సత్యంబిక పుట్టుట  సున్నా….ఆ...ఆ…”తారక”


ధర్మము తప్పక భధ్రాద్రీశుని తన మదిలో
నమ్ముకయున్నా…
మర్మము తెలిసిన రామదాసు నీ మందిరము కేగుచునున్నా….ఆ…..ఆ….”తారక”


ధన్యుడనయితిని ఓరన్నా…...3

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి