8, ఫిబ్రవరి 2017, బుధవారం

Hari hari rama హరి హరి రామ

హరి హరి రామ
కానడరాగం,  ఆదితాళం


హరిహరి రామ…...హరిహరి రామ నన్ అరమరచూడకు
నిరతము నీ నామ స్మరణయే మాకు
హరిహరి రామ…….


ధశరధ నందన దశముఖ మర్ధన
పశుపతి రంజన పాప విమోచన…
హరి హరి రామ…


మణి మయ భుషణ మంజుల భాషణ
రణ జయ భీషణ రఘుకుల భూషణ
హరి హరి రామ…….


పతిత పావన నామ భద్రచల రామ
సతతము శ్రీరామదాసుడ నేను…

హరి హరి రామ…..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి