8, ఫిబ్రవరి 2017, బుధవారం

Ramajoogi mandu gonare రామ జోగి మందు గొనరే

రామ జోగి మందు గొనరే
సద్భక్తి / ఖమాస్ రాగం , ఆది తాళం


పల్లవి :
రామజోగి మందు కోనరే, ఓ జనులారా
రామజోగి మందు కోనరే, ఓ జనులారా
రామజోగి మందు కోనరే యే...యే...యే..


చరణం:
రామజోగి మందు మీరు ప్రేమతో భుజియించరయ్యా
కామక్రోధా ములనెల్ల కడకు పారద్రోలే మందు..రామ జోగి…


కాటుక కొండల వంటి కర్మము లెడబాపే మందు
సాటిలేది జగము నందు స్వామి రామ జోగి మందు…..రామజోగి….


కోటి ధనము లిచ్చిననూ కొన్నను దొరకని మందు
సాటిలేని భాగవతులు స్మరణ చేసి తలచు మందు ..రామజోగి …


వాదుతో చెప్పిన గాని పాపము పోగొట్టు మందు
ముదముతోనే మోక్షమిచ్చే పొత్తు రామ జోగి మందు...రామజోగి..


ముదముతో భద్రాద్రి యందు ముక్తిని పొందించే మందు
సదయుడైనా రామదాసు సద్భక్తితో గొలిచే మందు…


రామజోగి  మందు కొనరే ఓ జనులారా
రామజోగి మందు కొనరే.ఏ …ఏ….

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి