కంటి నేడు మారాముల
నాదనామక్రియ రాగం, ఖండచాపు తాళం
కంటి నేడు మా రాముల
కనుగొంటి నేను మారాముల
కంటినేడు భక్త గణముల బ్రోచుమా
ఇంటి వేలుపు భద్రగిరి నున్నవానిని
కంటి నేడు మారాముల
చెలువొప్పు చున్నట్టి సీతా సమేతుడై కొలువు దీరిన మా కోదండరాముని…....కంటినేడు….
భరణికుల తిలకుని ఘననీల కాంతుని
కరుణా రసము కురియు కనుదోయి కలవాని
…….కంటినేడు…...
కురుముంజి ముత్యాల సరములు మెరయగా
మురిపెంపు చిరునగవు మోము కలిగిన వాని.
…....కంటినేడు…….
కరకు బంగరు చేల కాంతి జగములు గప్ప
శరచాపములు కేల ధరియించు స్వామిని..
……..కంటినేడు…
ధరణి పై శ్రీరామదాసుని నేలుడు వాని
పరమ పరుషుండయిన భద్రగిరి స్వామిని
కంటి నేడు మా రాముల
కనుగొంటి నేను మారాముల
కంటి నేడు మా రాముల.
శ్రీరాముల...మారాముల…...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి