తక్కువేమి మనకు
సౌరాష్ట్ర రాగం, ఆదితాళం
తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు...2
ప్రక్క తోడుగా భగవంతుడు తన చక్రధారియై చెంతనేయుండగా...తక్కువేమి…
మృత్యు సో…..మకుని మును జంపిన యా మత్స్య మూర్తి మన పక్షమునుండగా...తక్కువేమి….
సురల కొరకు మంధర గిరి మోసిన కూర్మావతారుని కృప మనకుండగా
…తక్కువేమి….
హిరణ్యకశిపుని ఇరు చెక్కలుగా పరచిన నరహరి ప్రక్కనే యుండగా...తక్కువేమి…
భుమి స్వర్గమును పొందుగ కొలిచిన వామునుండు మనవాడై యుండగా.
..తక్కువేమి…
దశగ్రీవమును దండించిన యా
ధశరధ రాముని దయ మనకుండగా...తక్కువేమి…
దుష్టకంసుని దృంచి నట్టి శ్రీ
కృష్ణుడు మనపై కృపతో నుండగ...తక్కువేమి…
రామదాసు నిల రక్షించెదనని ప్రేమతో
పలికిన ప్రభువిడ నుండగ...తక్కువేమి...
రాముండొక్కడుండు వరకు...2
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి