8, ఫిబ్రవరి 2017, బుధవారం

Sriramula divya nama శ్రీరాముల దివ్యనామ స్మరణ

శ్రీరాముల దివ్యనామ స్మరణ
సావేరి రాగం, ఆదితాళం


శ్రీరాముల దివ్య నామ స్మరణ సేయుచున్నచాలు
ఘోరమైన తపములను కోరనేటికే మనసా……”శ్రీరాముల”


తారక శ్రీరామనామ ధ్యానము చేసిన చాలు
వేరు వేరు దైవములను వెదకనేటికే మనసా…”శ్రీరాముల”


భాగవతుల పాదజలము పైన జల్లుకున్నా చాలు
భాగీరధికి పొయెనని భ్రాంతి ఏటికే మనసా…”శ్రీరాముల”


భాగవతుల వాగమృతము పానము జేసిన చాలు
బాగుమీర నట్టి అమృత పానమేటికే మనసా…”శ్రీరాముల”


పరుల హింస సేయకున్న పరమ ధర్మమంతే చాలు
పరులను రక్షింతునని పల్కనేటికే
…”శ్రీరాముల”


దొరకని పరులా ధనముల దోచక యుండితే చాలు
గురుతుగాను గోపురము గట్ట నేటికే మనసా….”శ్రీరాముల”


అతిధి వచ్చి యాకలన్నా అన్నమింత నిడినా చాలు
క్రతువు సేయవలెననే కాంక్ష ఏటికే
సతతము మా భద్రగిరి స్వామి రామదాసుడైన
ఇతర మతములని యేటి వెతల వేటికే మనసా


శ్రీరాముల దివ్య నామ స్మరణ సేయుచున్నచాలు
ఘోరమైన తపములను కోరనేటికే మనసా

ఘోరమైన తపములను కోరనేటికే…..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి