8, ఫిబ్రవరి 2017, బుధవారం

Paluke bangara mayena పలుకే బంగారమాయేనా

పలుకే బంగారమాయేనా
ఆనందభైరవి రాగం, ఆదితాళం


పలుకే బంగారమాయేనా  కోదండపాణి
పలుకే బంగారమాయే పిలిచిన పలుకవేమి
పలుకే బంగారమాయే పిలిచిన పలుకవేమి
కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రి
…..పలుకే బంగారమాయేనా….


ఇరవుగా ఇసుకలోన పొరలీన ఉడుతభక్తి కి
కరుణించి బ్రోచితివని నెరనమ్మియుంటిని తండ్రి
….పలుకే బంగారమాయేనా …


రాతిని నాతిగ చేసి భూతలమందు
ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి
…..పలుకే బంగారమాయేనా….


ఎంతో వేడినా గాని సొంతైన దయరాదు
పంతము సేయగనే నేనెంతటి వాడిని తండ్రి
పలుకే బంగారమాయేనా ….


శరణాగతత్రాణ బిరుదాంకితుడువు గావ
కరుణించు భద్రాచల వర రామదాస పోష


పలుకే బంగారమాయేనా  కోదండపాణి పలుకే బంగారమాయేనా  అందాలరామ ….పలుకే బంగారమాయేనా …..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి