24, మార్చి 2017, శుక్రవారం

పూల పాన్పు మీద | Poola Panpu Meeda

పూల పాన్పు మీద
పవళింపు సేవ పాట
త్యాగరాజస్వామివారి ఉత్సవ సంప్రాదాయ కీర్తన
ఆహిరి రాగం, తిశ్రగతి ఏక తాళం
గానం : మొక్కరాల కామేశ్వరీగారు.
పల్లవి :
పూల పాన్పు మీద బాగా పూర్ణ పవ్వళించు….
పూలపాన్పు మీద బాగా పూర్ణ పవ్వళించు
నీల ఘన శ్యామ హరే నిరుపమ రామయ్య మల్లె
…...పూలపాన్పు మీద బాగా పూర్ణ పవ్వళించు….

చరణం :
మధు శర్కర యానబాలు మరి యారగించి
విధుముఖ కమ్మని విడము వేసి నను కటాక్షించి
…..పూలపాన్పు మీద బాగా పూర్ణ పవ్వళించు….

పరిమళ గంధమ్ము మేన బాగుగాను పూసి
మెరయగ సుమహరములను మెడ నిండను వేసి
….పూలపాన్పు మీద బాగా పూర్ణ పవ్వళించు….
ఆగమోత్తమైన శయ్యనంగీకరించి
త్యాగరాజ కృతము లెల్ల తధ్యమని సంతోషించి

పూలపాన్పు మీద బాగా పూర్ణ పవ్వళించు
నీల ఘన శ్యామ హరే నిరుపమ రామయ్య మల్లె
పూలపాన్పు మీద బాగా పూర్ణ పవ్వళించు
పూర్ణ పవ్వళించు...పూర్ణ పవ్వళించు..పూర్ణ పవ్వళించు…...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి