అదివో నీ ప్రతాపము హనుమంతా
మాయ మాళవ గౌళ రాగం , ఆది తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీ గారు
జై జై జై జై వాయుపుత్ర
జై జై జై జై సూర్యమిత్ర
జై జై జై జై అంజని తనయ
జై హనుమంతా జై
పల్లవి :
అదివో నీ ప్రతాపము హనుమంతా
ఎదురు లేదు నీకు నెక్కడ హనుమంతా
చరణం :
మెత్తిన నీ కుడి హస్త మిలనసురుల చూచి
హత్తిరి పాతాళము హనుమంతా
చిత్తగించి నీ ఎడమ చేతి పిడికిటిని
తత్తరించి చిక్కిరదే దైత్యులు హనుమంతా
నలియ దొక్కిన నీ ఉన్నత పాదము కింద
అలమటించేరసురులూ హనుమంతా
చెలపట్టి నీవు జంక జాచిన పాద హతిని
పలు దానవులు భంగపడిరి హనుమంతా
వడి నీవు మీదికి వాలమల్లార్చిన
అడగిరి రాక్షసులు హనుమంతా
బడినే శ్రీ వేంకటేశు పంపున నీవు గెల్వగా
విడిదమై పొగడేరు పెద్ద హనుమంతా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి