23, ఆగస్టు 2017, బుధవారం

Bhramhasati బ్రహ్మసతి

బ్రహ్మసతీ సరస్వతి
గానం : విశాలి గారుAudio
పల్లవి :
బ్రహ్మసతీ సరస్వతి
వీణాపాణి విద్యల రాణి

చరణం :
చతుర్వేదములు నీవేనమ్మ
సప్త స్వరములు నీవేనమ్మా
తకతకిటయని తాళము నీవే
సర్వము నీవే మంజుల వాణి
….బ్రహ్మసతీ సరస్వతి….


గానము నీవే నాదము నీవే
కవి పుంగవులకు కలమూ నీవే
సర్వ కళా పరిపూర్ణవు నీవే
శర్వాణీ గీర్వాణి చదువుల రాణి
….బ్రహ్మసతీ సరస్వతి...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి