22, ఆగస్టు 2017, మంగళవారం

శ్రీపార్వతీ మాకు తల్లి sriparvati maku talli

శ్రీ పార్వతి మాకు తల్లి
(శివ పరివార దేవతాస్తవము)
రచన : శ్రీ కూచిమంచి సోమసుందరకవి  
స్వరకల్పన : శ్రీమతి సరోజిని శాస్త్రీ
శంకరాభరణ రాగం
ఏకతాళం
Audio
పల్లవి :
శ్రీ పార్వతి మాకు తల్లి
సాంబ శివుడే మముగన్న తండ్రి
శ్రీ పార్వతి మాకు తల్లి
సాంబ శివుడే మముగన్న తండ్రి

చరణం :
పాపదురులు గణపతి షణ్ముఖులు ఉగ్రరూపుడు వీర భద్రుడు భ్రాతలు మాకు
శ్రీ పార్వతి మాకు తల్లి
సాంబ శివుడే మముగన్న తండ్రి …

గరుడధ్వజుడు మేనమామ
మాకు గంగాభవాని పిన్న
కరమొప్ప శివభైరవాదులందరు మాకు
పరమ బంధులు ప్రేమబాయనివారు
శ్రీ పార్వతి మాకు తల్లి
సాంబ శివుడే మముగన్న తండ్రి

ఖ్యాతిగ ప్రమథులు హితులు
మాకు గౌరీశు కథలు సంగతులు
పాతకహారిణి పంచాక్షరీ విద్య
భూతిరుద్రాక్షలు భుషణంబులు మాకు
శ్రీ పార్వతి మాకు తల్లి
సాంబ శివుడే మముగన్న తండ్రి

శివభక్తి మాకు జీవనము మేటి
సువిరక్తి అక్షయ ధనము,
భగతాప హరమగు పారమామృతమూ నిచ్చు
శివ పూజయే మాకు శ్రీ ధేనువు
శ్రీ పార్వతి మాకు తల్లి
సాంబ శివుడే మముగన్న తండ్రి
సాంబ శివుడే మముగన్న తండ్రి
సాంబ శివుడే మముగన్న తండ్రి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి