12, సెప్టెంబర్ 2017, మంగళవారం

Govinda givindayani koluvare గోవింద గోవిందయని కొలువరే

గోవింద గోవిందయని కొలువరే
భౌళిరాగం,ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
గోవింద గోవిందయని కొలువరే
గోవిందాయని కొలువరే

చరణం :
హరిఅచ్యుతాయని ఆడరే
పురుషోత్తమాయని పొగడరే
పరమ పురుషాయని పలుకరే
సిరివర యనుచును చెలగరే జనులు
…..‌.గోవింద గోవిందయని కొలువరే…..‌

పాండవ వరదాయని పాడరే
అండజవాహను గొనియాడరే
కొండలరాయనినే కోరరే
దండితో మాధవుని తలచరే జనులు
….‌‌గోవింద గోవిందయని కొలువరే….‌‌
దేవుడు శ్రీ విభుడని తెలియరే
సోవల అనంతుని చూడరే
శ్రీవేంకటనాధుని చేరరే
పావనమై ఎపుడును బ్రదుకరే జనులు

గోవింద గోవిందయని కొలువరే
గోవిందాయని కొలువరే
గోవిందా గోవిందా గోవిందా..4

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి