12, సెప్టెంబర్ 2017, మంగళవారం

Vedambevvani వేదంబెవ్వని

వేదంబెవ్వని
రేవతి రాగం ,ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
వేదంబెవ్వని
వేదంబెవ్వని వెదకెడెని
ఆ దేవుని కొనియాడుడీ..
గోవిందా హరి గోవిందా వేంకట రమణ గోవిందా
గోవిందా హరి గోవిందా వేంకట రమణ గోవిందా

చరణం :
అలరిన చైతన్యాత్మకుడెవ్వడు
కలడెవ్వడెచట కలగలడనిన
తలతురెవ్వనిని తను వియోగ దశ
యికనాతని భజియించుడీ

వేదంబెవ్వని వెదకెడెని
ఆ దేవుని కొనియాడుడీ
గోవిందా హరి గోవిందా వేంకట రమణ గోవిందా
గోవిందా హరి గోవిందా వేంకట రమణ గోవిందా

కడగి సకల రక్షకుడిందెవ్వడు
వడి నింతయు నెవ్వని మయము
పిడికిట తృప్తుల పితురులెవ్వనిని
తడవిడ ఘనుడాతని గనుడీ

వేదంబెవ్వని వెదకెడెని
ఆ దేవుని కొనియాడుడీ
గోవిందా హరి గోవిందా వేంకట రమణ గోవిందా
గోవిందా హరి గోవిందా వేంకట రమణ గోవిందా

కదిసి సకల లోకంబుల వారలు
యిదివో కొలిచెదరెవ్వరిని
త్రిదశ వంద్యుడగు తిరువెంకటపతి
వెదకి వెదకి సేవించుడీ

వేదంబెవ్వని వెదకెడెని
ఆ దేవుని కొనియాడుడీ..
వేదంబెవ్వని వెదకెడెని
ఆ దేవుని కొనియాడుడీ
గోవిందా హరి గోవిందా వేంకట రమణ గోవిందా
గోవిందా హరి గోవిందా వేంకట రమణ గోవిందా గోవిందా హరి గోవిందా వేంకట రమణ గోవిందా
గోవిందా హరి గోవిందా వేంకట రమణ గోవిందా
వేంకట రమణ గోవిందా  వేంకట రమణ గోవిందా  వేంకట రమణ గోవిందా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి