హరి అవతారమితడు అన్నమయ్య
రచన :చినతిరుమలాచార్యులవారు
మాళవిగౌళ రాగం, ఆదితాళం
గానం: శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి:
హరి అవతారమితడు అన్నమయ్య
అరయ మా గురుడితడు అన్నమయ్య
చరణం:
వైకుంఠనాధుని వద్ద వడిపాడుచున్నవాడు
ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య
ఆకసపు విష్ణుపాదమందు నిత్యమై ఉన్నవాడు
ఆకడీకడ తాళ్ళపాక అన్నమయ్య
…...హరి అవతారమితడు…..
ఈవల సంసార లీల ఇందిరీశుతోనున్నవాడు
ఆవటించి తాళ్ళపాక అన్నమయ్య
భావింప శ్రీ వేంకటేశు పాదములందే వున్నవాడు
హావభావమై తాళ్ళపాక అన్నమయ్య
...హరి అవతారమితడు…...
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి