తొల్లింటి వలెగావు తుమ్మెద
శ్రీరాగము,ఖండగతి తాళం
గానం: శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
పల్లవి :
తొల్లింటి వలెగావు తుమ్మెద ఇంక
వొల్లవుగా మమ్ము ఓ తుమ్మెద
ఓ తుమ్మెద..ఓ తుమ్మెద
చరణం :
తోరంపు రచనల తుమ్మెద కడు
దూరేవు గొందులే తుమ్మెద
దూరినా నెరగవు తుమ్మెద
మమ్ము ఓరగా చూడకు ఓ తుమ్మెద
ఓ తుమ్మెద..ఓ తుమ్మెద
…….తొల్లింటి వలెగావు తుమ్మెద….
తొలి ప్రాయపు మిండ తుమ్మెద కడు
తొలిచేవు చేగలే తుమ్మెద
తొలకరీ మెఱుగులే తుమ్మెద ఇంక
ఉలికేవు మముగని ఓ తుమ్మెద
ఓ తుమ్మెద..ఓ తుమ్మెద
…...తొల్లింటి వలెగావు తుమ్మెద….
దొరవు వేంకటగిరి తుమ్మెద మా
తురుమేల చెనకేవు తుమ్మెదా
దొరికెనీ చనువులు తుమ్మెద ఇంక
వొరులెరింగిరి గాద ఓ తుమ్మెద
ఓ తుమ్మెద...ఓ తుమ్మెద
…..తొల్లింటి వలెగావు తుమ్మెద….
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి