19, మార్చి 2018, సోమవారం

Villambi varshamu vachenu విళంబి వర్షము వచ్చెను

విళంబి వర్షము వచ్చెను
సంగీత రచన : రమాకాంతగారు
స్వర రచన,గానం : శ్రీమతి యశోధరగారు
రాగం...కీరవాణి
Audio
పల్లవి :
విళంబి వర్షము వచ్చెను
కళ కళ మన కనులకిచ్చెను

అనుపల్లవి :
తళ తళ మన బ్రతుకు కొచ్చే
మెళుకవ ఉపదేశమిచ్చెను
….విళంబి వర్షము….

చరణం :
తరులు లతలు కొమ్మలందు
విరుల రంగులు రంగరించి
నరుల జన్మకు నూతనత్వం
వరము నీయగ వచ్చెను
….విళంబి వర్షము……

కలలు కంటూ ఊహలందు
కాలము గడిపేయువారికి
తలపులందు మలుపు తిప్పి
మేలుకొల్పను వచ్చెను
…...విళంబి వర్షము….‌

తెలుగువారి  ఆత్మలందు
తెలుగుదనపు వన్నె నింపి
జిలుగులొలికే కర్మవిలువ
తెలియజేయును వచ్చెను
….విళంబి వర్షము…..

నవత గుండెన నూతనత్వపు
భావజాలపు బాటవేసి
అవిరళ కృషి ఆత్మ ధైర్యము
రవళింప జేయను వచ్చెను.
…..విళంబి వర్షము…..

తిరుమలేశుని దయలతోటి
భారమైన బ్రతుకు వనమున
విరుల జల్లులు వంటి సుఖములు
విరగబూయును వేగ నొచ్చెను
…….విళంబి వర్షము……..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి