ఆరగించి కూచున్నాడు
ఆరభిరాగం , ఆదితాళం
గానం:శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
పల్లవి :
ఆరగించి కూచున్నాడల్లవాడె
చేరువనే చూడరే లక్ష్మీనారసింహుడు ||
చరణం :
ఇందిరను తొడమీద నిడుకొని కొలువిచ్చి
అందపు నవ్వులు చల్లి నల్లవాడె
చెందిన మాణిక్యముల శేషుని పడగమీద
చెంది వరాలిచ్చి లక్ష్మీనారసింహుడు ||
బంగారు మేడలోన పచ్చల గద్దియల మీద
అంగనల ఆట చూచి నల్లవాడే
రంగగు సొమ్ముల తోడ రాజసపు విభవాల
చెంగటనున్నాడు లక్ష్మీ నారసింహుడు ||
పెండెపు పాదము చాచి పెనచి ఒకపాదము
అండనే పూజలుగొని నల్లవాడె
కొండల శ్రీ వెంకటాద్రి కోరి అహోబలమున
మెండుగాను మెరసి లక్ష్మీనారసింహిడు ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి