గరుడాద్రి వేదాద్రి
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరి గారు
Audio
గరుడాద్రి వేదాద్రి కలిమి ఈపె
సిరులొసగీ చూడరో చింతామణి ఈపె
పాలజలధి పుట్టిన పద్మాలయ ఈపె
లాలిత శ్రీ నారసింహు లక్ష్మీ ఈపె
మేలిమి లోకమాతయై మించిన మగువ ఈపె
ఈ లీల లోకము లేలే ఇందిర ఈపె
ఘనసంపదలొసగు కమలాకాంత ఈపె
మనసిజు గనిన రమాసతి ఈపె
అనిశము బాయని మహాహరి ప్రియ ఈపె
ధనధాన్యరూపవు శ్రీతరుణి ఈపె
రచ్చల వెలసినట్టి రమావనిత ఈపె
మచ్చిక గల అలమేల్మంగ ఈపె
ఇచ్చటి వేంకటాద్రినీ అహోబలము
నందు
నిచ్చలూ తావుకొనిన నిధానము ఈపె
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి