22, మే 2018, మంగళవారం

Kommalala entavade కొమ్మలాల ఎంతవాడే

కొమ్మలాల ఎంతవాడే
బిళహరి రాగం ,ఆదితాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు

పల్లవి :
కొమ్మలాల ఎంతవాడే గోవిందరాజు
కుమ్మరించి రాజసమే గోవిందరాజు

చరణం :
ఉలిపచ్చి నవ్వులతో ఒత్తిగిలి పవళించి
కొలువు సేయించుకొని గోవిందరాజు
జలజాక్షులిద్దరును సరిపాదాలొత్తగాను
కొలదిమీర మెచ్చెనే గోవిందరాజు

ఒప్పుగా వామకరము వగిచాచి వలకేల
కొప్పూ కడునెత్తినాడు గోవిందరాజు
ఇప్పుడు శ్రీ వేంకటాద్రి ఇరవై శంఖుచక్రాలు
గుప్పె కటారము పట్టే గోవిందరాజు

కొమ్మలాల ఎంతవాడే గోవిందరాజు
కుమ్మరించి రాజసమే గోవిందరాజు
కొమ్మలాల ఎంతవాడే గోవిందరాజు
కొమ్మలాల ఎంతవాడే గోవిందరాజు
కొమ్మలాల ఎంతవాడే గోవిందరాజు…..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి