22, మే 2018, మంగళవారం

Kattedura vikumtam కట్టెదుర వైకుంఠం

కట్గాటెదుర వైకుంఠము
గానం:యశోధరగారుAudio
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
,తట్టలాయ మహిమలే తిరుమల కొండా తిరుమల కొండ…..2

వేదములే శిలలై వెలసినది కొండ
యేదెస పుణ్యంబురాసులే యేరులైనది కొండ…. 2
గాదిలి బ్రహ్మది లోకముల కొనల కొండ...2
శ్రీదేవుడుండేటి శేషాద్రికొండ…..కట్టెదుర….

సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ
నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ...2
వుర్వి దపసులే తరువులై నిలచిన కొండ...2
పూర్వ టంజనాద్రి పొడవాటి కొండ…..కట్టెదుర….

వరములు కొటారుగా వక్కాణించి పెంచే కొండ
పరగు లక్ష్మీకాంతు సోబనపు గొండ...2
కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ...2
విరివైన దదివో శ్రీవేంకటపు గొండ…

కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
,తట్టలాయ మహిమలే తిరుమల కొండా తిరుమల కొండ…..2

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి