16, జూన్ 2018, శనివారం

Sandekada buttinatti సందెకాడ బుట్టినట్టి

సందెకాడ పుట్టినట్టి
రాగం :రామక్రియ , తాళం: పల్లవి..చతురస్ర , చరణాలు ...తిశ్రం
మధ్యమం….Audio
పల్లవి :
సందెకాడ బుట్టినట్టి చాయల పంట యెంతచందమాయ చూడరమ్మా చందమామ పంట

చరణం :
మునుప పాలవెల్లి మొలచి పండిన పంట
నినుపై దేవతలకు నిచ్చపంట
గొనకొని హరికన్ను గొన చూపుల పంట
వినువీధి నెగడిన వెన్నెలల పంట

వలరాజు పంపున వలపు విత్తిన పంట
చలువై పున్నమ నాటి జాజర పంట
కలిమి కామిని తోడ కారుకమ్మిన పంట
మలయుచు తమలోని మఱ్ఱిమాని పంట

విరహుల గుండెలకు వెక్కసమైన పంట
పరగ చుక్కల రాసి భాగ్యము పంట
అరుదై తూరుపు కొండ నారగ పండిన పంట
యిరవై శ్రీవేంకటేశు నింటిలోని పంట

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి