16, జూన్ 2018, శనివారం

Vadala vadala vents vasantamu వాడల వాడల వెంట వసంతము

వాడల వాడల
శ్రీరాగం , ఆదితాళం
స్వర రచన : శ్రీ బాలచంద్ర ప్రసాద్ గారు

Audio
పల్లవి :
వాడల వాడల వెంట వసంతము
జాడతో చల్లేరు నీపై జాజర జాజర జాజ

చరణం :
కలికి నవ్వులె నీకు కప్పుర వసంతము
వలచూపు కలువల వసంతము
కులికి మాటాడినదే కుంకుమ వసంతము
చలమున చల్లె నీపై జాజర జాజర జాజ

కామిని జంకెన నీకు కస్తూరి వసంతము
వాముక మోహపు నీటి వసంతము
బూమెల సరసముల పుప్పొడి వసంతము
సామజ గురుడ నీపై జాజర జాజర జాజ

అంగన అధరమిచ్చి అమృత వసంతము
సంగడి శ్రీ వేంకటేశ సతి గూడితి
ముంగిటు రతి చెమట ముత్తేల వసంతము
సంగతాయ నిద్దరికి జాజర జాజర జాజ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి