28, జులై 2018, శనివారం

Hey vinayaka hey vinayaka హే వినాయక హే వినాయకా

హే వినాయక హే వినాయకా
నాటరాగం , ఏకతాళం
స్వర రచన :శ్రీమతి సరోజిని శాస్త్రీగారు
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
హే వినాయక హే వినాయకా…..
హే వినాయక హే వినాయకా
భావములో దలతు భక్త పాలకా
...హే వినాయక హే వినాయకా……

చరణం :
శరణు గజముఖ గిరిజా బాలకా
కరుణ జూడు దురిత హరణ పావనా
…..హే వినాయక హే వినాయకా….

భుజగ భూషణ సుజన పాలన
నిజముగ భజింతు త్రిజగ పోషణ
……..హే వినాయక హే వినాయకా…..

హారతి గైకొను హరప్రియ తనయ
ఆర్తి దీర్చ మము బ్రోవ రావయ

…...హే వినాయక హే వినాయకా
భావములో దలతు భక్త పాలకా
హే వినాయక హే వినాయకా…..3

Bala Tripura sundari బాలా త్రిపుర సుందరి

బాలా త్రిపుర సుందరి
రచన : ప్రయాగ రంగ దాసు గారు
స్వర రచన : బాల మురళి క్రిష్ణ గారు
భజన పాట…..తిశ్రగతి..ఏకతాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు.
Audio
పల్లవి :
సుందరి…..త్రిపుర సుందరి…..
బాలా త్రిపుర సుందరి గైకొనుమ హారతి
గానలోల జాలమెలా దారి చూపుమా...

చరణం :
సుందరాంగి అందరు నీ సాటిరారుగా
సందేహములు అందముగా తీర్పుమంటిని

వాసికెక్కి యున్న దానవనుచు నమ్మితి
రాసిగ సిరి సంపదలిచ్చి  బ్రోవుమంటిని

ఓం  హ్రీం  శ్రీం యనచు  మదిని తలచుచుంటిని
ఆపద లెడ బాపవమ్మ అతివ సుందరి

స్థిరముగ శ్రీకడలి యందు వెలసితివమ్మా
ధరణిలో శ్రీరంగదాసుని దయను చూడుమా

బాలా త్రిపుర సుందరి గైకొనుమ హారతి
బాలా త్రిపుర సుందరి గైకొనుమ హారతి
గానలోల జాలమెలా దారి చూపుమా...
గానలోల…...గానలోల……
గానలోల జాలమెలా దారి చూపుమా.
దారి చూపుమా…..దారి చూపుమా.
దారి చూపుమా………..

19, జులై 2018, గురువారం

Sri rama Krishna nama gaana ీ రామ క్రిష్ణ నామ గాన

శ్రీ రామ క్రిష్ణ నామ గాన
కళ్యాణిరాగం….ఆదితాళం/ఏకతాళం
స్వర రచన : శ్రీమతి వేమూరి సరోజిని శాస్త్రిగారు
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
మధ్యమం….
Audio
పల్లవి :
శ్రీ రామ క్రిష్ణ నామ గాన భజన చేయరా
పాపాలు వేనవేలు పారిపోవురా
హరి పారిపోవురా….శ్రీహరి పారిపోవురా

చరణం :
శబరి నీకు ఏమి ఇచ్చి వేడుకున్నదో
గుహుడు నిన్ను వేడినంత దాస్యమిస్తివి
రామయ్య మాకు ఏమి ఇచ్చెదవో తెలియదాయె
ఏ జన్మకైన నీదు భజన మరువలేమురా శ్రీ
…….రామ క్రిష్ణ నామ గాన ….

ద్రౌపదేమి ఇచ్చి నిన్ను పిలిచియున్నదో
కేకలేసి పిలిచినంత కోకలిస్తివి
క్రిష్ణయ్య మాకు ఏమి ఇచ్చెదవో తెలియదాయె
ఏ జన్మకైన నీదు భజన మరువలేమురా శ్రీ
…….రామ క్రిష్ణ నామ గాన ….

చెఱసాలయందు రామదాసు ఏమి తలచెనో
మొఱ విన్న నీవు చెఱసాలకు వచ్చితివి
రామయ్య మాకు ఏమి ఇచ్చెదవో తెలియదాయె
ఏ జన్మకైన నీదు భజన మరువలేమురా శ్రీ
…….రామ క్రిష్ణ నామ గాన ….

గజరాజు మొసలి బాధ  నీకు నిజము తెలిపెనా
పరుగు పరుగున వచ్చి ఆదుకొంటివి
క్రిష్ణయ్య మాకు ఏమి ఇచ్చెదవో తెలియదాయె
ఏ జన్మకైన నీదు భజన మరువలేమురా శ్రీ
…….రామ క్రిష్ణ నామ గాన ….
హరి పారిపోవురా...శ్రీహరి పారిపోవురా….

13, జులై 2018, శుక్రవారం

Kattedura vaikumtamu కట్టెదుర వైకుంఠము

కట్టెదుర వైకుంఠము
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
హిందోళరాగం , ఆదితాళం
Audio
పల్లవి :
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టెలాయ మహిమలే తిరుమల కొండా తిరుమల కొండ
తిరుమల కొండా …...తిరుమల కొండ

చరణం :
వేదములే శిలలై వెలసినది కొండ
యేదెస పుణ్యరాసులే యేరులైనది కొండ
గాదిలి బ్రహ్మది లోకముల కొనల కొండ.
శ్రీదేవుడుండేటి శేషాద్రీకొండ
…..కట్టెదుర….

సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ
నిర్వహించి జలధులే నిట్ట చరులైన కొండ
వుర్వి దపసులే తరువులై నిలచిన కొండ
పూర్వపుటంజనాద్రి పొడవాటి కొండ
…..కట్టెదుర….

వరములు కొటారుగా వక్కాణించి పెంచే కొండ
పరగు లక్ష్మీకాంతు సోబనపు కొండ
కురిసిన సంపదలెల్ల గుహల నిండిన కొండ
విరివైనదిదివో శ్రీవేంకటపుకొండా…

కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టెలాయ మహిమలే తిరుమల కొండా తిరుమల కొండ
తిరుమల కొండా …...తిరుమల కొండ
తిరుమల కొండా …...తిరుమల కొండ

5, జులై 2018, గురువారం

Namo Sarada నమో శారదా

నమో శారద
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
నమో శారద నమో శారద  నమో శారదా మాతా...2

చరణం :
హే విద్యా జ్ఞానప్రదాయిని
మా శ్వేతవసని కమలాసిని
భవ భంజని మనరంజని
వరదాయిని జనని
...నమో శారదా…

అంబా వీణా పుస్తక ధారిణి
శర్వాణి ప్రణవ స్వరూపిణి
మధుర భాషిణి సుగుణ భూషిణి
సంగీత సంచారిణి

నమో శారద నమో శారద  నమో శారదా మాతా...2

Giri Tanaya గిరి తనయ

గిరి తనయ
హంసధ్వని రాగం , ఏకతాళం
స్వర రచన : శ్రీమతి వేమూరి సరోజిని శాస్త్రీగారు
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరీగారు
Audio
పల్లవి :
గిరి తనయ ప్రియ సూన
కరిముఖ గణనాయక దేవ...2
మార వైరి వర తనయ దయనేలరా గణరాయ
మార వైరి వర తనయ మము దయనేలరా గణరాయ
…….గిరి తనయ ప్రియ సూన
కరిముఖ గణనాయక దేవ…...

చరణం :
నీ నామం ఏ మరక …..
నిరతము దలతుము భవనాశ
దీనపోష ఫణిభూష ….
ధర తొలి పూజిత విఘ్నేశా
…….గిరి తనయ ప్రియ సూన
కరిముఖ గణనాయక దేవ……

మూషిక వాహన ….
మునిజన సన్నుత నుత వరద
శ్రీ తాడ్బండుధీశ్వర …..
సమాజ సేవిత సురనాధా/
సిద్ది బుద్ధి గణనాధ ….
శ్రీకర శుభకర సురనాధా

…….గిరి తనయ ప్రియ సూన కరిముఖ గణనాయక దేవ...2
…..కరిముఖ గణనాయక దేవ
కరిముఖ   గణనాయక దేవ…….