21, మార్చి 2019, గురువారం

Manchi mohoortamuna మంచి ముహూర్తమున

మంచి ముహూర్తమున
అన్నమయ్య సంకీర్తన
పెళ్ళిపాటలు
సురటి రాగం , మిశ్రగతి తాళం
గానం : శ్రీమతి మొక్కరాల కామేశ్వరిగారు
Audio
పల్లవి :
మంచి ముహూర్తమున శ్రీమంతులిద్దరు
చంచుల పూవుదండలు చాతూకొనే రదివో

చరణం :
సొరిది పేరటాండ్లు శోబాన పాడగాను
హరియు సిరియు పెండ్లి ఆడేరదే
తొరలి యంతటా దేవదుందుభులు అరయగ….
గరిమ బాసికములు గట్టుకొనేరు / గట్టుకొనే రదివో
….మంచి ముహూర్తమున శ్రీమంతులిద్దరు
చంచుల పూవుదండలు చాతుకొనే రదివో….

మునులు మంగళాష్టకములు చదువుచుండగాను
పెనగుచు శేసలు వెట్టేరదే
ఘనులు బ్రహ్మాదులు కట్నములు చదువంగా..‌‌..
వొనరి పెండ్లిపీటపై ఉన్నారు / ఉన్నారు అదివో
….మంచి ముహూర్తమున శ్రీమంతులిద్దరు
చంచుల పూవుదండలు చాతూకొనే రదివో…

అమరాంగనలెల్లాను ఆరతులియ్యగాను
కొమరార విడేలందుకొనేరల్లదే..‌..
అమరి శ్రీవెంకటేశుడలమేలుమంగ గూడి…..
క్రమముతో వరములు కరుణించేరు / కరుణించేరదివో
…..మంచి ముహూర్తమున శ్రీమంతులిద్దరు
చంచుల పూవుదండలు చాతూకొనే రదివో..2
చంచుల...పూవుదండలు...చాతూ...కొనే..
రదివో

1 కామెంట్‌:

  1. మీకు ఫైనాన్స్ అవసరమా? మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు ఫైనాన్స్ కోసం చూస్తున్నారా? వ్యాపారం విస్తరించడానికి ఫైనాన్స్ పొందటానికి మరియు ఏదైనా మొత్తంలో కొత్త వ్యాపారాన్ని సెటప్ చేయడానికి మేము వ్యక్తులు మరియు సంస్థలకు సహాయం చేస్తాము. 3% సరసమైన వడ్డీ రేటుతో ఫైనాన్స్ పొందండి, వ్యాపారం కోసం మరియు మీ బిల్లులను క్లియర్ చేయడానికి మీకు ఈ ఫైనాన్స్ అవసరమా? మరింత సమాచారం కోసం ఇప్పుడే మాకు ఇమెయిల్ పంపండి (financialserviceoffer876@gmail.com) whats-App +918929509036 ద్వారా మమ్మల్ని సంప్రదించండి

    రిప్లయితొలగించండి